హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vishal - CM YS Jagan: సీఎం వైఎస్ జగన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన హీరో విశాల్.. ఆ నిర్ణయం వరం లాంటిందని ట్వీట్..

Vishal - CM YS Jagan: సీఎం వైఎస్ జగన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన హీరో విశాల్.. ఆ నిర్ణయం వరం లాంటిందని ట్వీట్..

విశాల్ - సీఎం జగన్

విశాల్ - సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై హీరో విశాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హ్యాట్సాఫ్.. అంటూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై హీరో విశాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హ్యాట్సాఫ్.. అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమిళనాడు (Tamil Nadu)లో కూడా అమలు చేయాలని ఆయన కోరారు. ఇంతకీ ఏ విషయం విశాల్.. సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారని అని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరి చదవాల్సిందే. ఏపీ ప్రభుత్వం.. సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దీనికి సంబంధించి ఓ జీవోను కూడా విడుదల చేసింది. ఏపీలో రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలోనే సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్ ( online cinema ticketing portal) కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించనుందని ఆ జీవోలో తెలిపింది. సినిమా టికెట్ల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకే కొత్త పోర్టల్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఈ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హీరో విశాల్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (CM YS Jagan) ప్రశంసలు కురిపించారు. ఈ విధానం తమిళనాడులో కూడా రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘ఏపీలోని థియేటర్లలో ఆన్‌లైన్ బుకింగ్‌ విధానాన్ని తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి హ్యాట్సాఫ్. మేము ఇలాంటి విధానాన్నే త‌మిళ‌నాడులో పెడితే బావుంటుంద‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాం. ఇలాంటి విష‌యం జ‌ర‌గడం చాలా ఆనందం. సినీ ప‌రిశ్ర‌మలోని ప్రతి ఒక్కరు దీనిని స్వాగతించాలి. ఇలా చేస్తే వంద‌శాతం పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. గౌర‌వ‌నీయులైన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ గారు ఇలాంటి ప‌ద్ధ‌తిని త‌మిళ‌నాడులో తీసుకురావాలని కోరుతున్నాను. అలా చేస్తే థియేట‌ర్స్ క‌లెక్ష‌న్స్ విష‌యంలో పార‌దర్శ‌క‌త క‌నిపిస్తుంది. సినీ ఇండ‌స్ట్రీకి, ప్ర‌భుత్వానికి ఇదొక వ‌రం’అని విశాల్ (Vishal) తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇక, సినిమా టిక్కెట్స్ ఆన్‌లైన్ బుకింగ్‌కు సంబంధించిన పోర్టల్‌ విధివిధానాలను రూపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఇందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ మంగళవారం సమావేశం నిర్వహించి, ప్రక్రియను ఎలా కొనసాగించాలో చర్చించింది.

First published:

Tags: Andhra Pradesh, Hero vishal, MK Stalin, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు