హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: జగన్ కు షాకివ్వనున్న 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు..

AP Politics: జగన్ కు షాకివ్వనున్న 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలో ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారు. ప్రస్తుతానికి వైసీపీకి తిరుగులేదు. ఐతే శుక్రవారం సినీనటుడు శివాజీ (Actor Shivaji) చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలో ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారు. ప్రస్తుతానికి వైసీపీకి తిరుగులేదు. ఐతే శుక్రవారం సినీనటుడు శివాజీ (Actor Shivaji) చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అమరావతి (Capital Amaravati) ని పూర్తి చేసి తీరాలంటూ హైకోర్టు తీర్పుఇచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు హాజరైన శివాజీ.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (CM Jagan) పరిపాలనను సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో దసరా పండుగ తర్వాతి రోజున వెల్లడిస్తానన్నారు.

  రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని కచ్చితంగా ఓడిపోతుందన్నారు శివాజీ. జగన్ కు పులివెందులలో కూడా గెలుపు కష్టమేనని.. అక్కడ కూడా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారని శివాజీ అన్నారు. వైసీపీ ఓటుకు 50వేలు ఇచ్చినా జనం ఓట్లు వేయరని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ మారాలని లేకుంటే ఫలితం లేదని జోస్యం చెప్పారు.

  ఇది చదవండి: వచ్చేఎన్నికల్లో ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ లేనట్లేనా..? పోటీగా కీలక నేత అనుచరుడు..

  ఐతే ఇటీవల ప్రతిపక్షం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu)హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ క్షణంలో అయినా ఎన్నికల రావొచ్చని ఆయన అన్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని ఎవరూ నిద్ర పోవద్దన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని చెప్పడమే కాదు.. ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా అచ్చెన్నజోస్యం చెప్పారు.. ఆయన చెప్పిన లెక్క చూస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పదు.. ఎందుకంటే ఇటీవల ఏపీలో జరిగిన ఏ ఎన్నిక చూసినా వార్ వన్ సైడ్ అయ్యింది. ఉప ఎన్నికైనా.. లోకల్ వార్ అయినా వైసీపీ బరిలో ఉంటే.. విపక్షాలు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం.. టీడీపీకి కంచుకోట లాంటి చోటే వైసీపీ జెండా రెప రెపలాడింది అంటే.. అధికార పార్టీ ప్రభంజనం ఎలా ఉందో ఊహించొచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎన్నికలు జరిగే టీడీపీకి కచ్చితంగా 160 స్థానాలు వస్తాయని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. అంతేకాదు ఓ రోజు రాత్రి ఉన్నట్లుండి నిద్రలేచి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు లేఖ ఇచ్చినా ఇవ్వొచ్చని అచ్చెన్న ఎద్దేవా చేశారు.

  First published:

  Tags: Andhra Pradesh, Shivaji, Ysrcp

  ఉత్తమ కథలు