హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Naresh: సినీ నటుడు నరేష్ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్.. కోర్టులో పిటిషన్

Naresh: సినీ నటుడు నరేష్ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్.. కోర్టులో పిటిషన్

 నరేష్, రమ్య రఘుపతి (ఫైల్ ఫోటో)

నరేష్, రమ్య రఘుపతి (ఫైల్ ఫోటో)

Actor Naresh: తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని.. అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేందుకు ప్రయత్నించిందని సినీ నటుడు నరేష్ ఆరోపణలు గుప్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తనకు తన భార్య రమ్య రఘుపతి, రోహిత్ శెట్టి నుంచి ప్రాణహాని ఉందని కోర్టులో ఆమె భర్త, సినీ నటుడు నరేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకుకు పర్మినెంట్ గార్డియన్‌గా నియమించాలని నరేష్ (Naresh) పిటిషన్‌లో పేర్కొన్నారు. పవిత్ర నేను కలిసే ఉన్నానని.. ఎవరికీ భయపడేది లేదని అన్నారు. తనను చంపడానికి గ్యాంగ్ తయారు చేసిందని ఆరోపించారు. 2010 మార్చి 3న బెంగుళూరులో రమ్యతో వివాహం జరిగిందని నరేశ్ చెప్పారు. పెళ్లికి కట్నం తీసుకోలేదని కోర్టుకు చెప్పారాయన రమ్యకు 30 లక్షల రూపాయలతో తన తల్లి విజయనిర్మల(Vijayanirmala) బంగారం చేయించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవన్నీ రమ్య మాయం చేసిందని ఆరోపించారు. తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య (Ramya) షరతు విధించిందన్నారు.

రమ్యకు తనకు 2012 లో రణ్‌వీర్ జన్మించాడని తెలిపారు. తనకు తెలియకుండానే పలు బ్యాంకులు, తమరు వ్యక్తుల దగ్గర డబ్బు తీసుకుందని కోర్టుకు నివేదించారు. తన పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిందన్నారు. 10 లక్షల రూపాయల అప్పు తీర్చానని చెప్పారు. తన కుటుంబ సభ్యుల నుంచి మరో 50 లక్షల రూపాయలు తీసుకుందన్నారు. పెళ్లయిన కొన్ని నెలల నుంచే వేధింపులు మొదలయ్యాయని చెప్పారు.

తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని.. అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపణలు గుప్పించారు. సుపారి గ్యాంగుతో తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని ఆరోపించారు. 2022 ఏప్రిల్‌లో కొంతమంది అగంతకులు తన ఇంట్లో చొరబడ్డారని, 24 లక్షల రూపాయలు రికవరీ చేయడానికి వచ్చామని మాయమాటలు చెప్పారని అన్నారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.

Tarakaratna: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్

Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి పూర్తి స్థాయి ఫ్యామిలీ డాక్టర్.. పూర్తి ప్రయోజనాలు ఇవే..

రమ్యకు తాను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసిందని ఆరోపించారు. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేయించి బెదిరించిందని, తనను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్లడం లేదన్నారు. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుందని, తన ఫోన్‌ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజీలు చూసేదన్నారు. రమ్యతో నరకయాతన అనుభవించానని, ఆమె వేధింపులు భరించలేకపోతున్నానని, అందువల్ల విడాకులు ఇప్పించాలని కోరారు.

First published:

Tags: Naresh

ఉత్తమ కథలు