సీఎం జగన్‌కు కమల్ హాసన్ థ్యాంక్స్.. అందరి కోరిక అదే అంటూ..

తమిళనాడులోనే కాకుండా దేశంలో ఆయనను నిజంగా అభిమానించే వారంతా ఆయనకు ఈ రకమైన గౌరవం దక్కాలని కోరుకుంటున్నారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 28, 2020, 9:52 PM IST
సీఎం జగన్‌కు కమల్ హాసన్ థ్యాంక్స్.. అందరి కోరిక అదే అంటూ..
వైఎస్ జగన్, కమల్ హాసన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీనియర్ నటుడు కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కన్నుమూసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన ట్వీట్‌లో ఈ లేఖను ప్రస్తావించిన కమల్ హాసన్.. సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పారు. తమిళనాడులోనే కాకుండా దేశంలో ఆయనను నిజంగా అభిమానించే వారంతా ఆయనకు ఈ రకమైన గౌరవం దక్కాలని కోరుకుంటున్నారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అంతకుముందు తన తండ్రికి భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసిన అంశంపై ఎస్పీ చరణ్ స్పందించారు. తన తండ్రే తమకు పెద్ద భారత రత్న అని ఆయన అన్నారు. ఒకవేళ ఆయనకు భారత రత్న పురస్కారం ఇస్తే స్వాగతిస్తామని తెలిపారు.అంతకుముందు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. సంగీతం, కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకుగానూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సీఎం జగన్ తన లేఖలో కోరారు. ఐదు దశాబ్దాల మర్చిపోలేని సేవలు అందించిన ఆయనకు ఇది మంచి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. గతంలో సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీంసేన్ జోషి వంటివారికి సైతం భారతరత్న ఇచ్చిన విషయం సీఎం జగన్ ఈ లేఖలో ప్రస్తావించారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం తమ రాష్ట్రంలో జన్మించడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టమని సీఎం జగన్ అన్నారు. ఆయన అకాల మరణం ఎంతోమంది అభిమానులను, ప్రముఖలను కలిచి వేస్తోందని అన్నారు. దేశంతో పాటు ప్రపంచ సంగీత కుటుంబానికే ఇది తీరని లోటు అని అన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన 50 ఏళ్ల పాటు సేవలందించారని లేఖలో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గౌరవాన్ని పొందారని అన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ: హిందీలో కలిపి బాలసుబ్రమణ్యం 40 వేల పాటలు పాడారని వెల్లడించారు. సింగర్‌గా ఆరు జాతీయ అవార్డులు, ఏపీ ప్రభుత్వం తరపున 25 నంది అవార్డులతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే అవార్డులను సొంతం చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు ఆయనకు వచ్చాయని తెలిపారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (ఫైల్ ఫోటో)


ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలన్న ఏపీ సీఎం జగన్ ప్రతిపాదనకు కమల్ హాసన్ మద్దతు తెలపడంతో.. ఇంకొందరు సినీ ప్రముఖులు కూడా కమల్‌కు జత కలుస్తారా ? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవేళ కమల్ హాసన్ తరహాలో మరికొందరు సినీ పెద్దలు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని కోరితే.. కేంద్రం ఆ దిశగా ఆలోచించే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 28, 2020, 9:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading