Home /News /andhra-pradesh /

ACCUSED REVEALED MISSING MYSTERY WHILE DRINKING AFTER FOUR YEARS OF MURDER IN EAST GODAVARI DISTRICT FULL DETAILS HERE PRN

Shocking: మందుకొట్టి నిజం చెప్పిన హంతకుడు..వీడిన నాలుగేళ్ల మిస్టరీ.. విచారణలో షాకింగ్ నిజాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా.. నాలుగేళ్ల తర్వాత సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చుక్కనోట్లోకి వెళ్లగానే మిగిలిన ముగ్గురులోని ఒకటు జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. నాలుగేళ్లుగా మిస్టరీగా ఉన్న కేసు ఒక్క రోజులో తేలిపోయింది

ఇంకా చదవండి ...
    నాలుగేళ్లక్రితం నలుగురు ఫ్రెండ్స్ కలిసి క్రికెట్ ఆడుతున్నారు. వారిలో ఒకరు ఇంటర్ చదువుతుండగా.. మిగిలిన ముగ్గురు కూలీపనలు చేస్తుండేవారు. ఆట మధ్యలో నలుగురి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఇంటర్ విద్యార్థి కనిపించకుండా పోయాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా.. నాలుగేళ్ల తర్వాత సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చుక్కనోట్లోకి వెళ్లగానే మిగిలిన ముగ్గురులోని ఒకటు జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. నాలుగేళ్లుగా మిస్టరీగా ఉన్న కేసు ఒక్క రోజులో తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) చాగల్లుకు చెందిన శ్రీహర్ష.. వేలివెన్నులోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్ చదువుతుండగా 2018లో దీపావళి సెలవులకు దారవరంలోని తాతయ్య శ్యామ్ సన్ ఇంటికి వచ్చాడు.

    అంతకుముందు నుంచి అదే గ్రామానికి చెందిన ఆదిత్య, షేక్ రషీద్, మునీంద్రతో హర్షకు స్నేహముంది. సెలవులు కావడంతో నిడదవోలు జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. అదే సమయంలో వారి మధ్య వివాదం రేగింది. ఆ తర్వాత శ్రీహర్ష అదృశ్యమయ్యాడు. అప్పట్లో శ్రీహర్ష కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి మిస్సింగ్ కేసు మిస్టరీగానే ఉంది. తమ కుమారుడు ఇంకా తిరిగివస్తాడని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలో షాకింగ్ నిజం తెలిసింది.

    ఇది చదవండి: యవతి నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లిన యువకుడు.. కేకలు విని పరుగులు పెట్టగా షాకింగ్ దృశ్యం



    శ్రీహర్ష ఫ్రెండ్స్ లో ఒకడైన రషీద్.. ఇటీవల మద్యం తాగి ఆ మత్తులో అసలు విషయం బయటపెట్టాడు. తనతో పెట్టుకోవద్దని.. ఇప్పటికే ఓ హత్య చేశానంటూ మాట తూలాడు. ఈ విషయం ఆ నోటా.. ఈనోటా పోలీసులకు చేరడంతో రషీద్ ను అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు బయటపెట్టాడు.

    ఇది చదవండి: ఫ్రెండ్స్ లవర్ తో యువకుడి ఎఫైర్.. కొన్నాళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్..


    2018లో గొడవ జరిగిన రోజు.. మునీంద్ర, రషీద్, ఆతిత్య కలిసి శ్రీహర్ష మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాలేజీలో పాడుబడిన సెప్టెంక్ ట్యాంక్ లో పడేశారు. ఆ తర్వాత ముగ్గురూ సైలెంట్ గా ఉండిపోయారు. ఐతే ఏడాది తర్వాత అంటే 2019లో అస్తిపంజరాన్ని తీసి నిడదవోలు రైల్వే గేటు దగ్గర్లోని కాలువలో పడేశారు. రషీద్ విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసులు సెప్టెక్ ట్యాంక్ ను పరిశీలించగా కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రషీద్ ను అరెస్ట్ చేయగా.., ఆతిద్య, మునీంద్ర పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Crime news, East Godavari Dist, Murder

    తదుపరి వార్తలు