ఏపీలో కొత్త మద్యం పాలసీ... 10 శాతం వైన్ షాపులు ఔట్...

New Liquor Policy : 2024 నాటికి మద్య నిషేధాన్ని సంపూర్ణంగా అమల్లోకి తెస్తామన్న ఏపీ ప్రభుత్వం తొలి ప్రయత్నం మొదలుపెట్టింది. ఫలితంగా 10 శాతం లిక్కర్ షాపులు క్లోజయ్యే పరిస్థితి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 6:45 AM IST
ఏపీలో కొత్త మద్యం పాలసీ... 10 శాతం వైన్ షాపులు ఔట్...
ఏపీ సీఎం జగన్ (File)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్... ఎన్నికల మేనిఫెస్టోలో... మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామనీ, మద్యా్న్ని పూర్తిగా నిషేధించాకే (ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప) 2024లో ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. అందులో తొలి దశ మొదలైంది. ఈనెల 30తో 2017-19కి మద్యం షాపులు, బార్‌ల లైసెన్సు ముగుస్తుంది. జూలై నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ వస్తుంది. దాని ప్రకారం దాదాపు 10 శాతం వైన్ షాపులు క్లోజ్ కాబోతున్నాయి. రాష్టంలో ప్రస్తుతం 4,200 లిక్కర్ షాపులు, 800కు పైగా బార్‌లూ ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.17,500 కోట్ల ఆదాయం వస్తోంది. వైన్ షాపులు తగ్గాలి... ఆదాయం మాత్రం తగ్గకూడదు... ఇదీ ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు పెట్టుకున్న టార్గెట్. ఇందుకు తగ్గట్టుగా పాలసీ రూపొందుతోంది.

ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేవాటిలో కీలకమైనది ఎక్సైజ్ శాఖ. ఈ ఆదాయంతోనే గత ప్రభుత్వం చాలా పథకాలకు నిధులు సమకూర్చుకుంది. ప్రస్తుతం సర్కారు దగ్గర నిధుల కొరత ఉండటంతో... లిక్కర్ రెవెన్యూపై ఆధారపడక తప్పని పరిస్థితి. మరి అదే లిక్కర్‌ను నిషేధించే లక్ష్యం ఉండటంతో... మద్యం పాలసీ సిద్ధం చేస్తున్న అధికారులు ప్రభుత్వం ముందు కొన్ని సూచనలు ఉంచబోతున్నారు. ప్రధానంగా లైసెన్స్ ఫీజును రెట్టింపు చేయాలని కోరబోతున్నారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇలాగే చేసి, సక్సెస్ అయ్యింది.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో మద్యం పాలసీ అమలుపై ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. గడువు లోపల అనుకున్న విధంగా పాలసీ ఉండకపోతే, పాత లైసెన్సులను మరికొంతకాలం పొడిగించే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా మద్యాన్ని నిషేధించే అంశంలో మాత్రం ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అందువల్ల భారమంతా అధికారులపైనే. రెవెన్యూ తగ్గకుండా ఏం చేయబోతున్నారన్నది తేలాల్సిన అంశం.

 ఇవి కూడా చదవండి :

నేడు నీతి ఆయోగ్ సమావేశం... చర్చించే కీలక అంశాలు ఇవీ...

Gyro Drop : అది ఫేక్ వీడియో... భలే నమ్మిస్తున్నారుగా...
Loading...

రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇవీ ప్రయోజనాలు...


టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే కచ్చితంగా తింటారు...
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...