శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం... లోయలోకి వెళ్లిన బస్సు

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మలుపులు ఉండే ఘాట్ రోడ్డుల్లో శ్రీశైలం హైవే ఒకటి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... పక్కనున్న అడవిలోకో, లోయలోకో వాహనాలు వెళ్లిపోవడం సహజం. తాజాగా అలాంటి ఘటన ఒకటి ప్రయాణికులకు టెన్షన్ తెప్పించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 1:19 PM IST
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం... లోయలోకి వెళ్లిన బస్సు
లోయలో పడిన బస్సు
Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 1:19 PM IST
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుపై వేగంగా బస్సును నడుపుతున్న డ్రైవర్... ఓ మలుపు దగ్గర కంట్రోల్ చెయ్యలేకపోయాడు. బస్సు చిన్నారుట్ల దగ్గర్లో అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి... పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా ప్రయాణికులు టెన్షన్ పడుతూ... గట్టిగా అరిచారు. ఐతే... లోయ మరీ ఎక్కువ లోతు లేకపోవడంతో... పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. వాళ్లంతా కంగారు పడి, తమ తమ సీట్లలోంచీ లేచి... బస్సులోంచీ బయటకు దూకేందుకు ప్రయత్నించారు. ఐతే... ఆ లోపే బస్సు ఆగింది. దాంతో... అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదుపు చెయ్యలేనప్పుడు అంత వేగంగా బస్సు ఎందుకు నడిపారంటూ డ్రైవర్‌పై మండిపడ్డారు. మహారాష్ట్ర నుంచీ త్వరగా వెళ్లాలని పదే పదే అడగడం వల్లే తాను వేగంగా నడపాల్సి వచ్చిందని డ్రైవర్ చెబుతున్నాడు. మొత్తానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యకపోతే, ప్రాణాలకే ప్రమాదం అని మరోసారి హెచ్చరిస్తోంది ఈ ఘటన.

సంక్రాంతి సమయం కావడంతో... చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు. డ్రైవర్లపై చాలా ఒత్తిడి ఉంది. జాగ్రత్తగా ప్రయాణాలు సాగించాలి. వేగంగా నడపమని డ్రైవర్లను తొందరపెట్టడం సరికాదంటున్నారు ఆర్టీసీ అధికారులు. కాస్త లేటైనా సురక్షితంగా ప్రయాణించడం అవసరమని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:


రాహుల్, హార్ధిక్ ఔట్... శుభమాన్, విజయ్ శంకర్ ఇన్... బీసీసీఐ తాజా నిర్ణయం


పల్లెకు పోయిన పట్నం... హైదరాబాద్ రోడ్లు ఖాళీ

Loading...

Makar Sankranti 2019: సకుటుంబ ‘సంక్రాంతి’ సమేతంగా..

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...