సీఎం జగన్ పంజా.. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఆఫీసులపై ఏసీబీ దాడులు..

ACB Raids in AP Today | అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి పథకాలపైనే దృష్టి సారించిన సీఎం జగన్.. ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చారు. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు దూకుడు చర్యలకు దిగారు.

news18-telugu
Updated: February 18, 2020, 2:53 PM IST
సీఎం జగన్ పంజా.. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఆఫీసులపై ఏసీబీ దాడులు..
సీఎం జగన్ (File)
  • Share this:
అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి పథకాలపైనే దృష్టి సారించిన సీఎం జగన్.. ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చారు. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు దూకుడు చర్యలకు దిగారు. గత కొంత కాలంగా అవినీతిపై కన్నెర్ర చేస్తున్న ఆయన.. ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా వివిధ మునిసిపల్ కార్యాలయాల్లో ఒకే సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయమే నెల్లూరు, గుంటూరు, పొద్దుటూరు, కాకినాడ తదితర మునిసిపల్ కార్పొరేషన్లలో దాడులు చేశారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగాల్లో రికార్డులను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో సీఎం ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగింది.

మున్సిపల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు


గతంలో తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించగా తాజాగా మునిసిపల్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. నెల్లూరులో ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంత్రో ఆధ్వర్యంలో, కడప జిల్లా అవినీతి నిరోధక శాఖ DSP జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో పొద్దుటూరు మునిసిపల్ కార్యాలయంలో, కాకినాడలో ఏసీబీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కాగా, సాధారణ తనిఖీల్లో భాగంగానే టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను పరిశీలించామని, అవకతవకలు ఉంటే ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 18, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading