ఏపీలో ఏసీబీ సునామీ... అసలేం జరుగుతోంది ?

ఏపీలో శుక్రవారం ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయాలపై సునామీల విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: January 24, 2020, 3:13 PM IST
ఏపీలో ఏసీబీ సునామీ... అసలేం జరుగుతోంది ?
ఆంధ్రప్రదేశ్ మ్యాప్
  • Share this:
ఏపీలో అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపాలని కొద్దిరోజుల క్రితం సీఎం జగన్ ఏసీబీని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తున్నారని ఆయన గతంలో ఏసీబీ శాఖపై సీరియస్ అయ్యారు. ఈ ప్రభావమో లేక మరోసారి సీఎం జగన్ నుంచి ఆదేశాలు అందాయో తెలియదు కానీ... ఏపీలో శుక్రవారం ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయాలపై సునామీల విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక తహశీల్దార్ కార్యాలయాలపై ఏకకాలంలో మెరుపు దాడులు చేసిన ఏసీబీ అధికారులు... ఆఫీసుల్లోని రికార్డులను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల కార్యాలయాలకు తాళాలు వేసి మరీ ఏసీబీ అధికారులు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.

విశాఖ సబ్బవరం, భీమిలి, రేణిగుంట, వడమాలపేట, మాచర్ల, వేపాడ, కొత్తూరు, ఎచ్చెర్ల, ముదిగుబ్బ,పొన్నలూరు, పెదపూడి, నూజెండ్ల, ఆవనిగడ్డ, తోట్లవల్లూరు, కల్లూరు, భట్టిప్రోలు, బ్రహ్మంగారి మఠం సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారింది. 14400 స్పందన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు రావడంతోనే ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఈ రకంగా అధికారులు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితం ఏపీ ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో జరుగుతున్న ఏసీబీ దాడులపై ఆయన సీఎం జగన్‌కు వివరిస్తున్నట్టు తెలుస్తోంది.
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు