ఈఎస్ఐ స్కాంలో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ...

ఈఎస్ఐ స్కాంలో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ...

అచ్చెన్నాయుడు

సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మురళీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారానికి దారి తీసిన ఈఎస్‌ఐ స్కాంలో మరో ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మంత్రి పితాని వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన మురళి అనే ఉద్యోగిని ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారించనుంది. ప్రస్తుతం సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మురళీ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సచివాలయంలో గుట్టుచప్పుడు కాకుండా ఎస్ఓ మురళీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆయన్ను విచారిస్తున్నారు.

  ఈ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ నిర్ణయించాలని వాదించారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు