Amaravati: అమరావతి భూముల స్కామ్‌పై ఏసీబీ కేసు ?

ACB Case on Amaravati Land Scam: ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై పూర్తిస్థాయిలో ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఏసీబీ పలు కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం.

news18-telugu
Updated: September 15, 2020, 10:31 AM IST
Amaravati: అమరావతి భూముల స్కామ్‌పై ఏసీబీ కేసు ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి రాజధాని భూముల స్కామ్‌పై ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)కేసు నమోదు చేసింది. అమరావతి భూముల కుంభకోణంపై ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై పూర్తిస్థాయిలో ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఏసీబీ పలు కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. అమరావతి భూములు విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని.. ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. సీఎం జగన్ సైతం ఈ విషయంలో పలుసార్లు విమర్శలు చేశారు. దీనిపై విచారణ చేయాలని అధికార వైసీపీ పలుసార్లు డిమాండ్ కూడా చేసింది.

అయితే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే అమరావతిలో భూముల సమీకరణ విషయంలో స్కామ్ జరిగిందనే అంశాన్ని మాత్రం వైసీపీ ఇప్పటికీ ప్రస్తావించింది. ఈ క్రమంలో ఈ భూముల కుంభకోణం అంశంపై ఏసీబీ కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం అంశంపై ఏసీబీ కేసు నమోదు చేయాలని నిర్ణయించగా... చంద్రబాబు హయంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్‌ వేదికగా గళం విప్పాలని నిర్ణయించారు. సీఆర్డీఏ అక్రమాలు, ఫైబర్ నెట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమయ్యారు.

సీఆర్‌డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని, రికార్డులు కూడా తారుమారు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అటు ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (APSFL)లో అవినీతి చోటుచేసుకుందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ రెండింటిపై సీబీఐ దర్యాప్తు కోరాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించినట్టు సమాచారం. గతంలోనే వైఎస్సార్‌సీపీ సీబీఐ దర్యాప్తు కోరినా.. కేంద్రం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంపై వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో దీనిపై గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 15, 2020, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading