అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు...

అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు...

అచ్చెన్నాయుడు (File)

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టై రిమాండ్‌లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.

 • Share this:
  ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టై రిమాండ్‌లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. తన అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలంటూ అచ్చెన్నాయుడు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అచ్చెన్నాయుడుకు ఇటీవల రెండు ఆపరేషన్లు జరిగాయని, ఆయన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదంటూ అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది వాదించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటారని, అందుకు తన సొంత డబ్బులే చెల్లిస్తారని కోర్టుకు తెలిపారు. అయితే, ప్రస్తుతం బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడుతూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.

  చంద్రబాబునాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో జూన్ 13న శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు సొంత ఇంటిలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడ తీసుకొచ్చారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అచ్చెన్నాయుడును విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరడంతో మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును అక్కడే, న్యాయవాది సమక్షంలో మూడు రోజుల పాటు ఏసీబీ విచారించింది.

  అచ్చెన్నాయుడు ఆరోగ్యం కుదుటపడకముందే జీజీహెచ్ వైద్యులు ప్రభుత్వం ఒత్తిడి మేరకు అచ్చెన్నాయుడును అర్ధరాత్రి డిశ్చార్జ్ చేశారంటూ టీడీపీ మండిపడింది. అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అనంతరం ఆయన్ను ఏసీబీ అధికారులు విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు కొలనోస్కోపీ పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు కాబట్టి, కరోనా పరీక్షలు జరపాలని అచ్చెన్నాయుడు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. లేకపోతే జైల్లోకి అనుమతించబోరన్నారు.
  First published:

  అగ్ర కథనాలు