Home /News /andhra-pradesh /

ACB CLARIFIES ON TDP LEADER ATCHANNAIDU ARREST IN ESI SCAM AK

అచ్చెన్నాయుడు అరెస్ట్.. ఏసీబీ ఏం చెప్పిందంటే..

అచ్చెన్నాయుడు (File)

అచ్చెన్నాయుడు (File)

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

    ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు... ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఆయనతో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని అన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో సుమారు 150 కోట్లు అక్రమాలు జరిగాయని ఆయన వివరించారు.

    ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించినట్టు నిర్ధారణ జరిగిందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. అలాగే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు విచారణలో తేలిందని అన్నారు. ఫేక్ ఇన్వాయిస్‌తో మందులు కొనుగోలుకు పాల్పడ్డారని చెప్పారు. అచ్చెన్నాయుడు కనీసం ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా తెలియకుండా కొన్ని ప్రక్రియలు చేశారని వివరించారు. విజిలెన్స్ రిపోర్ట్‌పై ప్రభుత్వ అదేశాలుపై ఏసీబీ కేసు విచారణ చేస్తూ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Esi scam, Kinjarapu Atchannaidu

    తదుపరి వార్తలు