రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు.. మరో 6 జిల్లాలకు విస్తరణ

మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

news18-telugu
Updated: July 13, 2020, 10:20 PM IST
రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు.. మరో 6 జిల్లాలకు విస్తరణ
నమూనా చిత్రం
  • Share this:
ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు రూ. 1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తించనుంది. పశ్చిమ గోదావరిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ సేవలను మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. సోమ‌వారం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా. మల్లిఖార్జున్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. అనంతరం మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించ‌నుంది.

ఏడాది జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించారు. మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశారు. అనంతరం ఆరోగ్య శ్రీ వర్తించే వైద్యప్రక్రియల సంఖ్యను 2,146కు పెంచారు. అంతేకాదు క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు. దాంతో మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Published by: Shiva Kumar Addula
First published: July 13, 2020, 10:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading