ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అది ఉంటేనే సచివాలయంలోకి ఉద్యోగులకు అనుమతి

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు అందించింది.

కొద్దిరోజుల క్రితం సెక్రటేరియట్‌లో మూడు, నాలుగు బ్లాకుల్లో పని చేసే ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడంతో అందులో పని చేసే సిబ్బందిని విధులకు రావద్దని ఆదేశించారు.

  • Share this:
    సచివాలయ ఉద్యోగుల విధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్‌సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్యసేతు యాప్‌ఉంటేనే ఇకపై కార్యాలయంలోకి అనుమతించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌విజృంభిస్తున్న కారణంగా ఉద్యోగులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యసేతు యాప్‌ఉన్న ఉద్యోగులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. విధుల్లోకి వచ్చే ఉద్యోగులకు థర్మల్‌స్క్రీనింగ్‌, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ చేశారు.

    కొద్దిరోజుల క్రితం సెక్రటేరియట్ లో మూడు, నాలుగు బ్లాకుల్లో పని చేసే ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడంతో అందులో పని చేసే సిబ్బందిని విధులకు రావద్దని ఆదేశించారు. సెక్రటేరియట్ లో ఉన్న అన్ని బ్లాకులను శానిటైజేషన్ చేశారు. సెక్రటేరియట్ పరిసరాల్లో క్రిమి సంహాకర మందుల చల్లుతున్నారు. పూర్తిస్థాయిలో పిచికారి ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
    Published by:Kishore Akkaladevi
    First published: