మద్యం దొరక్కపోవడంతో కోమాలోకి వెళ్లిన మహిళ..

మద్యానికి బానిసైన వారు మద్యం లేక పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈక్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ మద్యం దొరక్కపోవడంతో ఏకంగా కోమాలోకి వెళ్లింది.

news18-telugu
Updated: April 8, 2020, 1:47 PM IST
మద్యం దొరక్కపోవడంతో కోమాలోకి వెళ్లిన మహిళ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ పుణ్యమంటూ మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. దాదాపు 16 రోజులకు పైగా మద్యం దొరక్కపోవడంతో మత్తుకు బానిసైన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది. చుక్క నోట్లోపడకపోవడంతో నరాలు చచ్చిబడిపోతున్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రికి మద్యం దొరక్క వింతగా ప్రవర్తించే వారికి తాకిడి పెరిగింది. ఒక్కసారిగా ఇంతమంది వస్తుండడంతో వైద్యులకు సైతం ఏంచేయాలో పాలుపోవడం లేదు. మద్యానికి బానిసైన వారు మద్యం లేక పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళ మద్యం దొరక్కపోవడంతో ఏకంగా కోమాలోకి వెళ్లిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలం పాశర్లపూడి శ్రీరామ్‌పేటకు చెందిన బొమిడి మంగమ్మ నిత్యం మద్యం సేవించేది.

ఈ నేపథ్యంలో మద్యానికి బానిసయ్యింది. లాక్‌డౌన్ కారణంగా గత 15 రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయింది. రోజురోజూకీ ఆమె ఆరోగ్యం అస్వస్థతకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే నరాలు లాగేయడంతో కోమాలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజోలు ప్రభుత్వాస్పత్రికి మంగమ్మను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రాజోలు వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆమెను జీజీహెచ్‌కు తరలించడగా, పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తేల్చిచెప్పారు. లాక్‌డౌన్ తమ తల్లి ప్రాణాలను హరిస్తోందని, తమ తల్లిలాగే కోనసీమ ప్రాంతంలో మరికొంతమంది ఉన్నారని వారు తెలిపారు.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading