ప్లాట్‌ఫాంపైనే పండంటి మగబిడ్డకు ప్రసవం

ప్రతీకాత్మక చిత్రం

అప్పుడే రైలు దిగిన ఓ నిండు గర్భిణి తిరుపతి రైల్వే ప్లాట్‌ఫాంపై సొమ్మసిల్లిపడిపోయింది. స్పందించిన అక్కడి పారిశుద్ధ్య కార్మికులు ప్రసవం చేయడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

  • Share this:
    అది తిరుపతి రైల్వే స్టేషన్. రైళ్లలో వచ్చిపోయే ప్రయాణికులతో రైల్వే స్టేషనంతా రద్దీగా ఉంది. అంతలోనే ఎర్నాకుళం నుంచి పట్నాకు ప్రతి ఆదివారం వెళ్లే రైలు(16360) మధ్యాహ్నా సమయంలో తిరుపతికి చేరుకుంది. ఆ రైలు నుంచి దిగిన ఓ నిండు గర్భిణి నడవలేని స్థితిలో ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది. ఒక్కసారిగా ఆమె ప్లాట్‌ఫాంపైనే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే అక్కడే పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులు స్పందించి ఆమెకు సపర్యలు చేశారు. పురిటి నొప్పులు రావడంతో దుప్పట్లను చుట్టూ అడ్డుగా పెట్టి ప్రసవం చేశారు. సదరు మహిళ ప్లాట్‌ఫాంపైనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
    Published by:Vijay Bhaskar Harijana
    First published: