హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్రియుడి మోజులో పడి.. నిద్రపోతున్న భర్తను అతి దారుణంగా..

ప్రియుడి మోజులో పడి.. నిద్రపోతున్న భర్తను అతి దారుణంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రియుడు సురేశ్‌తో కలిసి భూలక్ష్మి రాడ్డుతో నాగరాజు తలపై బలంగా కొట్టి చంపేశారు. అనంతరం ఉరి వేసుకునేలా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.

  రోజురోజూకీ మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు కొంతమంది మహిళలు. ఇలాంటి ఘటనే ఏలూరులోను జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు పట్టణానికి చెందిన గుడిపూడి నాగరాజు(38), భూలక్ష్మికి ఏడు సంవత్సరాల క్రితం పెళ్లయ్యింది. నాగరాజు తాపీ మేస్త్రీగా పనిచేస్తూ పెదపాడు మండలం వట్లూరులో నివాసం ఉంటున్నాడు. నాగరాజు వద్ద వట్లూరుకు చెందిన తోకల సురేశ్ పనిచేస్తూ సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య భూలక్ష్మితో సురేశ్‌కు అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో తమ సంబంధానికి అడ్డొస్తాడనే ఉద్దేశంతో నాగరాజును ఏలాగైనా అడ్డు తొలగించుకోవాలని భూలక్ష్మి నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈనెల 6న రాత్రి ఇంటిలో నాగరాజు నిద్రపోతున్నాడు.

  ఈ సమయంలో ప్రియుడు సురేశ్‌తో కలిసి భూలక్ష్మి రాడ్డుతో నాగరాజు తలపై బలంగా కొట్టి చంపేశారు. అనంతరం ఉరి వేసుకునేలా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో తెల్లవారితే అందరికీ తెలిసిపోతుందన్న భయంతో భూలక్ష్మి, సురేశ్‌లిద్దరూ వదిలేసి పారిపోయారు. తెల్లారిన తర్వాత ఇరుగుపొరుగు నాగరాజు చనిపోయి ఉండడాన్ని గమనించి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ సీఐ మూర్తి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  Published by:Anil
  First published:

  Tags: Andhra Pradesh, Eluru, Police

  ఉత్తమ కథలు