గుంటూరు జిల్లాలో విషాదం.. మూడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి..

ప్రతీకాత్మక చిత్రం

ఆరుబయట ఆడుకుంటున్న ఈ చిన్నారిపై అక్కడే ఉన్న ఓ నాలుగు కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించింది.

  • Share this:
    గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడిచేయడం తో చనిపోయిన ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరుజిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన షేక్ షాపూర(3)మరో చిన్నారితో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. కరోనా వైరస్ నేపథ్యంలో జనసంచారం ఎక్కువగా లేకుండాపోయింది. చాలావరకు ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. అయితే ఆరుబయట ఆడుకుంటున్న ఈ చిన్నారిపై అక్కడే ఉన్న ఓ నాలుగు కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించింది. బాలిక చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Narsimha Badhini
    First published: