తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య... దర్శనాలు తాత్కాలిక నిలుపుదల

Tirumala : తిరుమలలో ఊహించని విషాదం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది.

news18-telugu
Updated: December 13, 2019, 12:46 PM IST
తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య... దర్శనాలు తాత్కాలిక నిలుపుదల
తిరుమలలో శ్రీవారి ఆలయం
  • Share this:
Tirumala : తిరుమలలో శ్రీవారి ఆలయానికి దగ్గర్లోనే జరిగిందీ విషాదం. కదులుతున్న టీటీడీ పాల లారీ కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీవారి ఆలయానికి దగ్గర్లోని మాడవీధిలో పాలు దించిన పాల మిత్ర లారీ... ముందుకు కదులుతుండగా పక్కనే ఉన్న వ్యక్తి... ఒక్కసారిగా వెనక చక్రాల కిందకు వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. మొదట దీన్ని ప్రమాదంగా భావించారు. అయితే సీసీ ఫుటేజ్ చూశాక ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరణించిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. తిరుమల మాడవీధిలో ఈ ఆత్మహత్య జరగడంతో వెంటనే ఆలయంలో శ్రీవారి దర్శనాలు నిలిపి వేశారు. మాఢ వీధులలో మృతి చెందడంతో ఆలయ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు సూచనతో ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి తర్వాత శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు.


శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పాల వ్యాన్ కింద పడి ఓ వ్యక్తి చనిపోవడం దారుణమన్నారు దీక్షీతులు స్పందించారు. తిరుమలలో దేహ త్యాగం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందన్న మూఢ నమ్మకంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. తిరుమలలో ప్రమాదవశాత్తూ ఎదైనా మరణం సంభవిస్తే అలాంటి వారికి మాత్రమే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్న ఇలాంటి వాటిని ఎవరూ చేయకూడదన్నారు. మాఢ వీధిలో ఈ ఆత్మహత్య జరగడంతో ఆగమ శాస్ర్తానుసారం సంప్రోక్షణ నిర్వహించామని, కొంత సేపు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశామని తెలిపారు.


టాలీవుడ్ వైపు చూస్తున్న టాక్సీవాలా నటి మాళవికా నాయర్ఇవి కూడా చదవండి :బ్రిటన్ ప్రధానిగా మళ్లీ గెలిచిన బోరిస్ జాన్సన్Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...

Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి

Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు

Health : సంతాన సమస్యలను దూరం చేసే ఆహారం... తప్పక తినాలి...

Published by: Krishna Kumar N
First published: December 13, 2019, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading