చిత్తూరులో విషాదం.. తండ్రి మరణ వార్త విన్న కొడుకు గుండెపోటుతో..

పలమనేరు అంతరాష్ట్ర సరిహద్దులో పోలీసులు అతడిని రాష్ట్రంలోకి అనుమతించలేదు. దీంతో ఆధారాల కోసం తండ్రి ఫొటోను కుటుంబ సభ్యులు అతడికి వాట్సప్‌లో పంపారు.

news18-telugu
Updated: May 27, 2020, 2:25 PM IST
చిత్తూరులో విషాదం.. తండ్రి మరణ వార్త విన్న కొడుకు గుండెపోటుతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మరణవార్త విన్న ఓ కొడుకు గుండెపోటుతో మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు రూరల్ మండలం నల్ల వెంకటయ్యగారి పల్లెకు చెందిన ఆంజనేయుడు నాయుడు(78) అనారోగ్యంతో మ‌ృతిచెందాడు. ఆయన కొడుకు బాబు నాయుడు బెంగళూరులో ఉంటున్నాడు. అయితే తండ్రి అంత్యక్రియల కోసమని బెంగళూరు నుంచి చిత్తూరుకు బయలుదేరాడు. పలమనేరు అంతరాష్ట్ర సరిహద్దులో పోలీసులు అతడిని రాష్ట్రంలోకి అనుమతించలేదు. దీంతో ఆధారాల కోసం తండ్రి ఫొటోను కుటుంబ సభ్యులు అతడికి వాట్సప్‌లో పంపారు. వాట్సప్‌లో తండ్రి ఫొటోను చూసిన వెంటనే బాబు నాయుడు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో వైద్యులు అతడిని పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు. కాగా తండ్రికొడుకులు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Published by: Narsimha Badhini
First published: May 27, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading