పాత సామాన్లు కొంటామని వచ్చి.. బంగారం లాక్కెళ్లాడు.. బీ అలర్ట్

పాత సామాన్లు కొంటామని వచ్చి.. బంగారం లాక్కెళ్లాడు.. బీ అలర్ట్

ప్రతీకాత్మక చిత్రం

'అవునా.. మా ఇంట్లో చాలా పిల్లి పిల్లలు ఉన్నాయి. ఇస్తాను ఆగు' అంటూ వెళ్లి.. ఓ పిల్లిని తీసుకొచ్చి అతడి చేతిలో పెట్టింది.

 • Share this:
  పాత సామాన్లు కొంటామని వచ్చి మహిళ మెడలో బంగారాన్ని లాక్కెళ్లాడో దొంగ. ఆమెను మాటల్లో పెట్టి ఒంటిపై నగలను ఎత్తుకెళ్లాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పద్మావతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి కేసరపల్లిలో నివసిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. పాత సామాన్లు కొంటాం.. మంచి రేటు ఇస్తా.. అని ప్రచారం చేస్తూ బైక్‌పై దిగాడు. మేడం మీ ఇంట్లో ఎవైనా పాత సామాన్లు ఉన్నాయా.. కొంటామని అడిగాడు. మా ఇంట్లో ఏవీ లేవని ఆమె సమాధానం చెప్పింది. ఇంట్లో పిల్లి పిల్లలు కనిపించడంతో.. మేడం ఆ పిల్లులను ఇస్తారా..? పెంచుకుంటామని అడిగాడు.

  'అవునా.. మా ఇంట్లో చాలా పిల్లి పిల్లలు ఉన్నాయి. ఇస్తాను ఆగు' అంటూ వెళ్లి.. ఓ పిల్లిని తీసుకొచ్చి అతడి చేతిలో పెట్టింది. పిల్లిని చేతిలో పెట్టే సమయంలో ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుని లాగేశాడు. గొలుసు చేతిలోకి రాగానే బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలు వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి.. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు