హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ... టీడీపీ నేత చేయించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు...

ఏపీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ... టీడీపీ నేత చేయించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు...

వైఎస్ జగన్ (File)

వైఎస్ జగన్ (File)

AP Assembly Election 2019 : సాధారణంగా... ఏ పార్టీ సర్వే చేయిస్తే, ఆ పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్ వస్తుంటుంది. ఐతే ఆ టీడీపీ నేత చేయించిన సర్వే మాత్రం టీడీపీకే షాక్ ఇస్తోంది. అనవసరంగా ఆ సర్వే చేయించామని టెన్షన్ పడుతున్నారట నేతలు.

ఇంకా చదవండి ...

    మే 23న వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం మనం రెండు వారాలు ఆగాలి. కానీ... రాజకీయ నేతలకు వేరే పనులేముంటాయి. రాజకీయాలే అసలు పని. సో, రెండు వారాలు ఆగాలంటే వాళ్ల వల్ల కావట్లేదు. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు సహా... చోటా మోటా నేతలంతా తమ స్థాయి కొద్దీ రకరకాల సర్వేలు చేయించుకున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు చేయిస్తున్న సర్వేలను కూడా కొనుక్కొని... వాటిని కూడా విశ్లేషించుకుంటున్నారు. తమ సర్వేలకూ, ఇతరులు చేసిన సర్వేలకూ ఏయే సీట్లలో ఒకే రకమైన ఫలితం ఉంటుందో, అక్కడ కచ్చితంగా అదే ఫలితం వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. అలా కాకుండా వేర్వేరు ఫలితాలు వస్తే, ఆ నియోజకవర్గాలపై మళ్లీ మళ్లీ సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఆరాటం కొద్దీ నందిగామకు చెందిన ఓ టీడీపీ నేత సొంతంగా సర్వే చేయించుకున్నారు. ప్రత్యేకతేంటంటే... ఆయన 2014లో కూడా సొంత సర్వే చేయించుకున్నారు. అప్పట్లో టీడీపీ గెలుస్తుందని రిపోర్ట్ వచ్చింది. అలాగే టీడీపీ గెలిచింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా సర్వే చేయించారు.


    తాజాగా చేయించిన సర్వేలో... టీడీపీ మాగ్జిమం 58 సీట్లు సాధిస్తుందని రిపోర్ట్ వచ్చే సరికి ఆయన కంగారు పడినట్లు తెలిసింది. అదే సర్వేలో వైసీపీకి మాగ్జిమం 105 స్థానాలు వస్తాయని తేలడంతో... కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఇన్నాళ్లూ... తమకు సీట్లు తగ్గినా... జనసేన ద్వారా పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావచ్చనే అంచనాల్లో ఉన్న ఆ నేత... తన సర్వే రిపోర్టులో జనసేనకు 3 సీట్లు మాత్రమే వస్తాయని తేలడంతో మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.


    ఏపీలో మొత్తం 175 స్థానాలు ఉండగా... మ్యాజిక్ మార్కు... 88. సో, టీడీపీ నేత సర్వే ప్రకారం వైసీపీకి క్లియర్ మెజార్టీ ఉన్నట్లే. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకపోయినా దర్జాగా అధికారంలోకి రావచ్చు. అదే సమయంలో... టీడీపీ, జనసేన కలిసినా ఆ కూటమికి వస్తున్నవి 61 స్థానాలే. మరో 9 స్థానాల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ఉంటుందని తెలిసిందట. పోనీ ఆ 9 స్థానాలూ టీడీపీకే దక్కినా... మొత్తం స్థానాలు 70 (కూటమిగా లెక్కిస్తే) అవుతాయి. అప్పటికీ అధికారానికి చాలా దూరంలో ఉన్నట్లే.


    ఈ సర్వేను నమ్మాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారట ప్రస్తుతం ఆ నేత. ఐతే... కొన్ని ప్రైవేట్ సంస్థలు చేయించిన సర్వేల్లో కూడా ఇలాంటి ఫలితాలే రావడంతో... తన సర్వే నిజం అవుతుందేమోనని టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది. ఐతే ఈ సర్వేపై టీడీపీ వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందనీ, లేనిపోని గందరగోళం సృష్టించేందుకే ఈ సర్వేను తెరపైకి తెచ్చారా అని సదరు నేతపై మండిపడుతున్నట్లు తెలిసింది. మొత్తానికి అసలు ఫలితాల సంగతేమోగానీ... ఇలాంటి సర్వేలు మాత్రం కొందరు రాజకీయ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే, మరికొందరికి ఎండల్లో చల్లదనాన్ని ఇస్తున్నాయి.


     


    ఇవి కూడా చదవండి :


    వైసీపీ గెలిస్తే, వాళ్లందరికీ జగన్ చుక్కలు చూపిస్తారా...? రెడీ అవుతున్న లిస్ట్...?


    ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...


    దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?


    చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?

    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Janasena, Pawan kalyan, Tdp, Ycp, Ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు