హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ జిల్లాకు జాషువా పేరు పెట్టాలి.. ఏపీలో కొత్త డిమాండ్

ఆ జిల్లాకు జాషువా పేరు పెట్టాలి.. ఏపీలో కొత్త డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గడచిన 24 గంటల్లో మళ్లీ భారీగా పెరిగింది. 24 గంటల్లో 10,621 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. అలాగే, 24 గంటల వ్యవధిలో ఏపీలో 92 కరోనా మరణాలు రికార్డు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గడచిన 24 గంటల్లో మళ్లీ భారీగా పెరిగింది. 24 గంటల్లో 10,621 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. అలాగే, 24 గంటల వ్యవధిలో ఏపీలో 92 కరోనా మరణాలు రికార్డు అయ్యాయి.

జాషువా రచనలు దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కొత్త జిల్లాల్లో గుంటూరుకు గానీ, పల్నాడుకు గానీ జాషువా పేరు పెట్టాలని ఆయన కోరారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు కమిటీ తమ పని తాను చేసుకుంటూ వెళ్తోంది. మరోవైపు జనాల నుంచి కొత్త కొత్త డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుతో పాటు పేర్లకు సంబంధించి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరులో కొత్త ఏర్పాటయ్యే జిల్లాకు కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరుతున్నారు.

గుంటూరులోని నగరపాలెంలో శుక్రవారం జాషువా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని జాషువాకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్.. దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. జాషువా సమాధిని అభివృద్ధి చేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని పర్యాటకకేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. జాషువా రచనలు దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కొత్త జిల్లాల్లో గుంటూరుకు గానీ, పల్నాడుకు గానీ జాషువా పేరు పెట్టాలని ఆయన కోరారు.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా చేస్తే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు కావాలి. అంటే ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు వస్తాయి. ఐతే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఇటీవల కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నందున రెండు జిల్లాలుగా చేయాలని నేతలు సూచించారు. ఈ క్రమంలో ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది..

First published:

Tags: Andhra Pradesh, AP new districts, AP News, Guntur

ఉత్తమ కథలు