నెల్లూరులో విషాదం.. పెట్రోల్‌లో శానిటైజర్‌ కలుపుకొని తాగి...

గత 25 రోజులుగా లాక్‌డౌన్ వల్ల మద్యం దొరక్క అల్లాడిపోతున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో స్థానికులు గమనించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు.

news18-telugu
Updated: April 19, 2020, 3:00 PM IST
నెల్లూరులో విషాదం.. పెట్రోల్‌లో శానిటైజర్‌ కలుపుకొని తాగి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ వల్ల మందుబాబులు విగతజీవులుగా మారుతున్నారు. దాదాపు 25 రోజులకు పైగా మద్యం దొరక్క పిచెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. కొంతమంది మత్తు కోసం రకరకాల రసాయనాలు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. తాగుడుకు బానిసైన ఓ యువకుడు లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్క పెట్రోల్‌లో శానిటైజర్‌ కలుపుకొని తాగి మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డీసీపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నలిపోగు నరేశ్‌ (30) మద్యానికి బానిసయ్యాడు. గత 25 రోజులుగా లాక్‌డౌన్ వల్ల మద్యం దొరక్క అల్లాడిపోతున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో స్థానికులు గమనించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్క ఇంట్లో ఉన్న శానిటైజర్‌ను పెట్రోల్‌లో కలుపుకొని తాగినట్లు వారు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Published by: Narsimha Badhini
First published: April 19, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading