హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Snake Revenge: పాములు పగబడతాయా..? ఈ వ్యక్తిని ఏకంగా 72 సార్లు కాటువేశాయి..

Snake Revenge: పాములు పగబడతాయా..? ఈ వ్యక్తిని ఏకంగా 72 సార్లు కాటువేశాయి..

సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం

సినిమాలలో అయితే పాములు పగబట్టినట్టు చూశాం.. ఎక్కడెక్కడో జరిగినట్టు వింటాం కానీ.. స్థానికంగా అట్లాంటి ఘటనలేవీ మన కళ్ల ముందు జరిగిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తికి జరిగిన ఘటన చూస్తే.. నిజంగానే పాములు పగపడుతాయా..? అనే అనుమానం రాకమానదు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

పాములు పగపడుతాయా లేదా అనే వాటికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తుంటారు. పాములు ఒకరిపై పగపడితే... సదరు వ్యక్తి చనిపోయే వరకూ వేటాడుతూనే ఉంటాయని కొందరు అంటుంటే.. పాములకు ఏమాత్రం జ్ఞాపక శక్తి ఉండదని హేతువాదులు ఖండిస్తున్న పరిస్థితి. సినిమాలలో అయితే పాములు పగబట్టినట్టు చూశాం.. ఎక్కడెక్కడో జరిగినట్టు వింటాం కానీ.. స్థానికంగా అట్లాంటి ఘటనలేవీ మన కళ్ల ముందు జరిగిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తికి జరిగిన ఘటన చూస్తే.. నిజంగానే పాములు పగపడుతాయా..? అనే అనుమానం రాకమానదు. ఆ వ్యక్తిని ఒకసారి.. రెండుసార్లు కాదు.. ఏకంగా 72 సార్లు పాము కాటుకు గురయ్యాడు.

పాములకు ఎలాంటి అతేంద్రియ శక్తులు, జ్ఞాపక శక్తి లేందంటూ సైన్స్ తో పాటు మారుతున్న టెక్నాలజీలో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాము తలపై అత్యంత విలువైన మణులు, మణిఖ్యాలు ఉంటాయని కొందరు ప్రగాఢంగా నమ్ముతుంటే.. వాటిని కొట్టిపడేసే వారే ఎక్కువ. పాములకు జ్ఞాపక శక్తి ఉంటుందా..? ఒక మనిషిపై పగ బట్టి పదే పదే కాటు వేయడానికి చూస్తోందా..? అసలు ఇల్లు దాటి బయట వస్తే నాగుపాము కాటు వేయడం ఖాయమా..? అనే ప్రశ్నకు సుబ్రమణ్యం కథ అవును అనే సమాధానం చెబుతోంది. తాను అనుభవిస్తున్న మానసిక క్షోభే ఇందుకు నిదర్శనంగా మారుతోంది.


చిన్నప్పట్నుంచే పగబట్టాయా..?

చిత్తూరు జిల్లా బైరెడ్డి మండల కేంద్రంలోని కుమ్మరగుంట గ్రామంలో పూర్వీకుల నుంచి స్థిరనివాసం ఏర్పరుచుకున్న సుబ్రమణ్యం కుటుంబీకులు ఆ గ్రామంలో ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటూ...కూలి నాలి చేసుకొని బ్రతికే వారు. ఏమైందో ఏమో ఐదవ తరగతి నుంచి నాగరాజు పగబట్టాడేమో ఏమో గాని 5వ తరగతిలో మొదటి సారి పాము కాటుకు గురైయ్యాడు. అప్పటి నుంచి ఏడాదికి రెండు నుంచి మూడు సార్లు పాముకాటుకు గురవుతున్నాడు. అదేం విచిత్రమో.. దైవ రహస్యమో తెలియదు కాని అమావాస్య, పౌర్ణమి నాడు సుబ్రమణ్యం ఇంటి ముందు పాములు ప్రత్యక్షం అవుతున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నాడు సుబ్రమణ్యం. ఏకాకంగా 32 సంవత్సరాల్లో 72 సార్లు పాము కాటు వేసిందని, పాము కాటుకు గురైన ప్రతి సారి రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సుబ్రమణ్యం.

ప్రతీకాత్మక చిత్రం

ఉండేది పూరి గుడిసెలో.. చేసేది వ్యవసాయ కూలీగా...

ప్రతి ఏటా పాము కాటుకు గురై 40 నుంచి 50 వేలు వెచ్చించడం చాలా కష్టంగా మారిందని సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ధీన స్థితిలో జీవినం సాగిస్తున్న పరిస్థితి సుబ్రమణ్యం కుటుంబంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే పాము భయం....ఊరు వదిలి వేరొక ప్రాంతానికి వెళ్తే అక్కడకు నాగుపాములు ప్రత్యక్షం అవుతుండడంతో స్వగ్రామంలోని ఇంటి నుంచి బయటకు రావడమే మానేశాడు సుబ్రమణ్యం. బయట వెళ్లిన ప్రతిసారి నాగుపము కనపడటం, తాను వెనుదిరగటం...ధైర్యంగా ఒక్కఅడుగు ముందుకు వేస్తే పాము కాటుకు గురి కావడం సుబ్రమణ్యం జీవితంలో సాధారణంగా మారింది.

దాతలు, ప్రభుత్వంపైనే భారం.. 

కూలి చేసుకుంటే తప్ప పొట్ట కనపడని కుటుంబం కావడం, నిత్యం ప్రాణాన్ని అరచేతిలో పెట్టికొని గడుపుతున్నాడు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఆసుపత్రిలలో చూపించినా తనకు వచ్చిన కష్టం మాత్రం తప్పడం లేదు. ఇంటిళ్లిపాది నెలంతా కష్టపడ్డ సొమ్ముమొత్తం సుబ్రమణ్యం వైద్య అవసరాలకే వినియోగిస్తుండటంతో జీవనాననికి అప్పు చేసి గంజి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈతాకు, తర్బాల్ పట్టాలతో కప్పిన పూరిల్లు కావాదంతో వానకు ఇంట్లో ప్రవహించే నీటికి గ్రామంలోని తోటి గ్రామస్తుల ఇంటిలో తలదాచుకోవల్సి వస్తోందని కుటుంబీకుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం, దాతలు సహాయం కోసం నిరీక్షిస్తున్నట్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు...

First published:

Tags: Andhrapradesh, AP News, Chittoor, Snake, Snake bite