24 ఏళ్లుగా మౌన దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

చదువుకునే వయస్సులో పూర్ణచందర్‌రావుకు సూర్యప్రకాశ్ సీనియర్. అయితే సూర్యప్రకాశ్ తదనంతర కాలంలో సూర్యప్రకాశనంద సరస్వతిగా మారి మౌనదీక్ష చేపట్టాడు.

news18-telugu
Updated: July 9, 2020, 2:12 PM IST
24 ఏళ్లుగా మౌన దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మౌనదీక్ష చేస్తున్న పూర్ణచందర్‌రావు
  • Share this:
సాధారణంగా మనం కొద్దిసేపు మాట్లాడకుండా ఉండాలంటే.. చాలా ఇబ్బందిపడతాం. ఎంత ప్రయత్నించినా కొద్దిసేపటికే నోటిలో నుంచి మాటలు బయటకు వస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒక్కటీ కాదు రెండు కాదు.. ఏకంగా 24 ఏళ్లుగా మౌనదీక్ష చేస్తున్నాడు. ఎవరాయన..?, ఎందుకీ మౌనదీక్ష అనుకుంటున్నారా..? చదువుకునే వయస్సులో తన సీనియర్ సలహా మేరకు చేపట్టిన మౌన వ్రతం చేపట్టాడు. అప్పటి నుంచి దీక్షను నేటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెంనకు చెందిన కశిందుల పూర్ణచందర్‌రావుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన పదో తరగతి వరకు చదువుకున్నాడు. అయితే చదువుకునే వయస్సులో పూర్ణచందర్‌రావుకు సూర్యప్రకాశ్ సీనియర్. అయితే సూర్యప్రకాశ్ తదనంతర కాలంలో సూర్యప్రకాశనంద సరస్వతిగా మారి మౌనదీక్ష చేపట్టాడు. అలా ప్రకాశం జిల్లా బొగ్గులకొండలో మౌనస్వామిగా ప్రసిద్ధి పొందారు.

- అన్నా రఘు, న్యూస్ 18 ప్రతినిధి

Silence, Andhra Pradesh, Swamiji, Guntur, spiritual, మౌన దీక్ష, ఆంధ్రప్రదేశ్, స్వామిజీ, గుంటూరు, అధ్యాత్మికం,
భూదానంతో పాటు రూ.5 లక్షల విరాళం ఇచ్చి నిర్మిస్తున్న శివాలయం ముందు పూర్ణచందర్‌రావు


పూర్ణచందర్‌రావు కొంతకాలం సూర్యప్రకాశనంద సరస్వతి స్వామి శిష్య బృందంలో చేరాడు. ఈ క్రమంలోనే స్వామిజీ సూచనల మేరకు తనని తాను తెలుసుకోవడం కోసం అంతర్మథనం చేసే ప్రయత్నంలో భాగంగా మనసుని నిలకడగా ఉంచేందుకు మౌనదీక్ష చేపట్టాడు. మౌనంగా ఉండి ఆత్మసిద్దిని సాధించడం కోసం 24 ఏళ్లు పూర్ణచందర్‌‌రావు కృషి చేస్తున్నాడు.  దాదాపు 1996 సంవత్సరం నుంచి పూర్ణచందర్‌రావు ఇప్పటివరకు మౌనదీక్షలో ఉన్నాడు. నాటి నుంచి తన అవసరాలకు ఇతరులకు అర్ధమయ్యే విధంగా సైగలతోనే చెబుతాడు. అర్ధంకాని వారికి పేపరు మీద రాసి చెబుతుంటాడు. సూర్యప్రకాశనంద సరస్వతి స్వామిజీని నిత్యం ఆరాధిస్తూ ఉంటాడు.

పూర్ణచందర్‌రావు గ్రామంలో శివాలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగానే శివాలయం నిర్మాణానికి 50 సెంట్ల భూమితో పాటు రూ.5 లక్షల నగదును విరాళంగా ఇచ్చాడని గ్రామస్తులు చెబుతున్నారు. మౌన దీక్ష చేపట్టిన కొత్తలో కొంచెం ఇబ్బంది పడినా.. తర్వాత సాధనతో పూర్తిగా అలవాటయ్యింది. చిన్ననాటి నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతోనే దీక్ష చేయగలుగుతున్నానని పూర్ణచందర్ రావు కాగితంపై రాసి తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading