తిరుమల రోడ్డుపై చిరుత పులి కలకలం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో ఓ చిరుత రోడ్డు మీదకు వచ్చింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో రోడ్డుపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

news18-telugu
Updated: July 7, 2020, 4:12 PM IST
తిరుమల రోడ్డుపై చిరుత పులి కలకలం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
తిరుమల కొండపై చిరుత సంచారం
  • Share this:
తిరుమల క్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంది. అందుకే అడవుల నుంచి వన్య మృగాలు కొండపైకి రావడం సర్వ సాధారణమైంది. లాక్‌డౌన్ సమయంలో జన సంచారం లేకపోవడంతో అడవి జంతువులు తిరుమల కొండపై ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు లాక్‌డౌన్ అన్‌లాక్ 2 దశలో.. జనాలు తిరుగుతున్నా.. అప్పుడప్పుడూ చిరుతలు ప్రత్యక్షమవుతున్నాయి.

తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. సోమవారం రాత్రి గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో ఓ చిరుత రోడ్డు మీదకు వచ్చింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో రోడ్డుపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూసి స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటు అధికారులు సైతం రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 3:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading