‘బాబూ.. పిల్లి పోయింది.. మీకు కనిపించిందా?’.. 22 రోజులుగా వెతుకుతున్న జంట

పిల్లి పోయిందంటూ వారు వెతుకుతుంటే, కొందరు కామెడీ అనుకున్నారు. మరికొందరు జాలిపడ్డారు. ఇంకొందరు ఆకతాయిలు ‘మీ పిల్లిని వెతికి పెడతాం.’ అని చెప్పి రూ.50వేల వరకు దండుకుని పారిపోయారు.

news18-telugu
Updated: July 5, 2019, 4:36 PM IST
‘బాబూ.. పిల్లి పోయింది.. మీకు కనిపించిందా?’.. 22 రోజులుగా వెతుకుతున్న జంట
పిల్లితో జైష్ భాయ్, మీనా దంపతులు
  • Share this:
అల్లారుముద్దుగా, కన్నబిడ్డలా పెంచుకున్న పిల్ల తప్పిపోయిందని.. దాని కోసం ఓ జంట 22 రోజులుగా వెతుకుతోంది. కనిపించిన ప్రతి వారికి పిల్లి ఫొటో చూపించి.. మీకేమైనా కనిపించిందా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆ దంపతులు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన బట్టల వ్యాపారి జైష్ భాయ్, అయన భార్య మీనా కు వివాహమై 17 సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేరు. దీంతో గత ఏడాది ఒక పిల్లిని తెచ్చుకొన్నారు. దానికి ‘బాబు’ అని పేరుపెట్టి ముద్దుగా చూసుకుంటున్నారు. తమకు పిల్లలు లేరనే విషయాన్ని మర్చిపోయి సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఈలోగా ఒక సారి తిరుమల దర్శనం చేసుకోవడానికి వారు ఆ పిల్లితో పాటు వచ్చారు. జూన్ 9న తిరుమల చేరుకున్నారు. 13న సూరత్ బయలుదేరేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకొన్నారు.

ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆ పిల్లిని ఎత్తుకెళ్లిపోయాడు. రైల్వేస్టేషన్ మొత్తం వెతకటం ప్రారంభించారు. కానీ ఎంత ప్రయత్నించినా పిల్లి దొరకలేదు. ఎవరైనా సాయం చేసి తమ పిల్లిని వెతికి పెట్టాలని కోరుతున్నారు. పిల్లి పోయిందంటూ వారు వెతుకుతుంటే, కొందరు కామెడీ అనుకున్నారు. మరికొందరు జాలిపడ్డారు. ఇంకొందరు ఆకతాయిలు ‘మీ పిల్లిని వెతికి పెడతాం.’ అని చెప్పి రూ.50వేల వరకు దండుకుని పారిపోయారు.

విషయం తెలుసుకున్న కొందరు స్థానిక టాక్సీ డ్రైవర్లు ఆ జంటకు తోడుగా వచ్చి రైల్వే పోలీసులకి విషయం తెలిపారు. అయితే రైల్వే పోలీసులకు ఏం కేసు పెట్టాలో తెలియక.. వారిని ఇంటికివెళ్లి పోవాల్సిందిగా సూచించారు. కానీ, వారు గుజరాత్ వెళ్లకుండా రేణిగుంట రైల్వే స్టేషన్‌లోనే పిల్లి కోసం వెతుకుతున్నారు. పిల్లితో పాటు తీయించుకున్న ఫొటోను పట్టుకుని, కట్టుబట్టలతో రేణిగుంటలో ప్రతి వీధి తిరుగుతూ పిల్లి కోసం వెతుకుతున్నారు.
First published: July 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading