హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Onion Crop: మార్కెట్ లో కన్నెర్ర చేసిన రైతు.. సరైన ధర రాలేదని ఉల్లి పంటకు నిప్పు.. ఎక్కడో తెలుసా?

Onion Crop: మార్కెట్ లో కన్నెర్ర చేసిన రైతు.. సరైన ధర రాలేదని ఉల్లి పంటకు నిప్పు.. ఎక్కడో తెలుసా?

ఉల్లికి మంట

ఉల్లికి మంట

Fire to an Onion Crop: సామాన్యుడిని ఏడిపిస్తోంది.. కట్ చేయకుండానే కన్నీరు కార్చేలా చేస్తోంది. అలాగని రైతులకు లాభాల పంట పడించడం లేదు.. కనీసం మద్దతు ధర కూడా లేక రైతులు లబోదిబో అంటున్నారు.. ఈ పరిస్థితితో విసుగు చెందిన రైతులు మార్కెట్ లో ఏం చేశారో తెలుసా?

ఇంకా చదవండి ...

A farmer sets fire to an onion crop: ఉల్లి రైతులు కన్నెర్ర చేశారు.. ఆరుగాలం కష్టపడి.. శ్రమకు ఓర్చి.. చెమట చిందింది.. అప్పులు చేసి.. పస్తులు ఉండి.. ఉల్లి పంట పండిస్తే.. కనీసం మద్ధతు ధర రావడం లేదని.. అలాగని అతి తక్కువ ధరకు ఉల్లి అమ్ముతున్నారా అంటే అదీ లేదని రైతులు కన్నెర్ర చేశారు. ప్రస్తుతం పరిస్థితి.. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లా మార్కెట్ యార్డులో గుండె తరుక్కుపోయే సీన్ కనిపించింది. ఓ ఉల్లి రైతు తన పండించిన పంటను ఎంతో ఆశతో మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు. ప్రస్తుతం ధరలు నేల చూపులు చూస్తున్న నేపథ్యంలో కనీసం పెట్టుబడి ఖర్చులు అయినా వస్తాయని ఆశించాడు. కానీ అక్కడ మాత్రం క్వింటాల్ ఉల్లికి 400 రూపాయలు కూడా రాలేదన్న ఆవేదనతో తాను తెచ్చిన పంటను దహనం చేశాడు. ఉల్లిపాయలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తాను తెచ్చిన ఉల్లిని మార్కెట్ లొనే దగ్ధం చేశాడు. పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం, క్వింటాల్ ఉల్లి ధర 400 రూపాయలు కూడా రాకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. హై క్వాలిటీ పంటను మాత్రమే కొనుగోలు చేస్తూ మిగతా వాటిని పట్టించుకోవడంలేదని ఆగ్రహం చేశాడు. వ్యాపారులు, మార్కెట్ అధికారులపై మండిపడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన కర్నూలు ఆనియన్ మార్కెట్ లో ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాట ధర కల్పిస్తారని మార్కెంట్ తీసుకొస్తున్న సందర్భంలో క్వింటాలుకు కేవలం 340 రూపాయల ఉల్లిని తీసుకుంటున్నారు. దీంతో పంచలింగాలకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెచ్చిన ఉల్లి పంటపై పెట్రోల్ పోసి, ఇలా దగ్ధం చేశాడు. వ్యాపారులు, అధికారులపై మండిపడ్డాడు. దీంతో మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది.


ఈ-నామ్‌లో కొంతమందికి మాత్రమే మంచి ధరలు లభిస్తున్నాయని, మిగతా రైతుల పంటకు మద్దతు ధర లభించడం లేదని వాపోయాడు. సదరు రైతు పంచ లింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా తెలిసింది. నష్టానికి పంట అమ్ముకోలేక తన ఉల్లికి నిప్పు పెట్టానంటూ బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే తోటి రైతులు మంటలు ఆర్పేసి.. రైతు వెంకటేశ్వర్లుకి సర్ది చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశాడు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Onion price

ఉత్తమ కథలు