హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Weather: ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఐఎండీ తాజా హెచ్చరిక ఇదే

AP Weather: ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఐఎండీ తాజా హెచ్చరిక ఇదే

Cyclone Alert: ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా మారి, ఆ తర్వాత తుఫాన్‌గా మారితే దానికి జవాద్ (Jawad Cyclone) అని పేరు పెడతారు. సౌదీ అరేబియా ఆ పేరును సూచించింది

  గత నెలల కురిసిన కుండపోత వర్షాలతో ఇప్పటికే ఏపీ అతలాకుతలమయింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఆ వరద బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతాన్ని ఆనుకొని అండమాన్ సముద్రం మీదుగా దక్షిణ థాయ్‌లాండ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure).. గురువారం నాటికి వాయుగుండం (Depression)గా బలపడుతుతందని భారత వాతావణ విభాగంతో పాటు ప్రైవేట్ వాతావరణ  సంస్థ స్కైమెట్ కూడా వెల్లడించింది. డిసెంబరు 3 నాటికి అది మరింతగా బలపడి తుఫాన్‌ (Cyclone)గా మారవచ్చని అంచనా వేస్తోంది. అది క్రమంగా వాయువ్య దిశగా ప్రయాణిస్తూ డిసెంబరు 4న ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

  Tirumala Darshan Update: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం వాయిదా వేసుకోవాలన్న టీటీడీ..

  AP Pensions: ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్..? ఈ ఒక్కలేఖతో చిక్కుల్లో జగన్

  ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా మారి, ఆ తర్వాత తుఫాన్‌గా మారితే దానికి జవాద్ (Jawad Cyclone) అని పేరు పెడతారు. సౌదీ అరేబియా ఆ పేరును సూచించింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు ఒడిశాకు వర్ష ముప్పుపొంచి ఉంది. తీరం దాటే సమయంలో భీకర వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్రలో ఈదురు గాలులతో కూడిన కుండపోత వానలు పడవచ్చని పేర్కొన్నారు.

  అల్పపీడనం గమనాన్ని లైవ్‌లో వీక్షించండి.

  Jobs in Nellore: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  డిసెంబరు 4 వరకు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cyclone, Cyclone alert

  ఉత్తమ కథలు