ఆ పోస్టే.. ఆమె కొంపముంచింది.. సీఐడీ విచారణకు రంగనాయకమ్మ..

ప్రతీకాత్మక చిత్రం

ఎల్జీ ప్రమాదంపై ఎం జరిగిందో దానినే తాను ఫేస్ బుక్‌లో పెట్టానని వివరించారు. అలా పోస్టులు పెట్టడం తప్పని కూడా తనకు తెలియదన్నారు.

  • Share this:
    ఒక్క పోస్టు.. ఆమెను సీఐడీ విచారణ వరకు లాక్కెళ్లింది. ఏంటీ ఆ పోస్టు.. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా.. మరేం లేదండీ..ఆంధ్రప్రదేశ్‌లోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగాలతో కేసు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మే. ఆమె గురువారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై రంగనాయకమ్మను అధికారులు విచారిస్తున్నారు. రంగనాయకమ్మ సీఐడీ ఆఫీసుకు వెళ్లముందు ఆమెను సీపీఐ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎలాంటి నేరం చేయలేదన్నారు. ఎల్జీ ప్రమాదంపై ఎం జరిగిందో దానినే తాను ఫేస్ బుక్‌లో పెట్టానని వివరించారు. అలా పోస్టులు పెట్టడం తప్పని కూడా తనకు తెలియదన్నారు. సీఐడీ వాళ్లకు ఇదే విషయాన్ని చెబుతానని ఆమె వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని సీఐడీ అధికారులు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
    Published by:Narsimha Badhini
    First published: