చీరాల సముద్ర తీరానికి... కొట్టుకొచ్చిన బుద్ధుడి ఆలయం

సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్ధుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది.

news18-telugu
Updated: February 26, 2020, 12:13 PM IST
చీరాల సముద్ర తీరానికి... కొట్టుకొచ్చిన బుద్ధుడి ఆలయం
చీరాల సముద్ర తీరానికి... కొట్టుకొచ్చిన బుద్ధుడి ఆలయం
  • Share this:
ప్రకాశం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకువచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటుపడవపై ఉంది.  సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్ధుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తిగా తలరివచ్చారు. అయితే ఆ ఆలయంపై ఓ జాతీయ జెండా కూడా ఎగురడం గుర్తించారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని అక్కడున్న వారు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు తీర ప్రాంతానికి వచ్చి పరిశీలించారు.

అయితే తూర్పుగోదావరి జిల్లా రామాయపట్నం - పెద్దపట్టపుపాలెం మధ్య తీరానికి గత ఆదివారం ఖాళీ కంటైనర్‌ కొట్టుకువచ్చింది. మెరైన్‌ సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం గత వారంలో సముద్రంలో వచ్చిన తుపాను ధాటికి ఓ ఓడ పైనుంచి కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. వాటిలో రామాయపట్నం తీరానికి ఒకటి, నెల్లూరు జిల్లాలోని వాకాడు ప్రాంతానికి మరో రెండు కంటైనర్లు కొట్టుకువచ్చాయని తెలిపారు. ఇవి ఎవరివో, ఎక్కడివో సోమవారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. విషయాన్ని ఉలవపాడు ఎస్సై శ్రీకాంత్‌కు, వీఆర్వోలకు తెలియజేశామన్నారు.First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు