హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. ఐఐటీ మద్రాస్‌లో ఘటన

ఏపీ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. ఐఐటీ మద్రాస్‌లో ఘటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చదువులు... చావులవుతున్నాయా? చదవలేక చనిపోతున్నారా? ఎందుకీ పరిస్థితి? దేశంలో విద్యా మేథావులు దీనిపై ఆలోచిస్తే బాగుంటుంది. ప్రాణాలు పోతున్నాయి. మన విద్యావ్యవస్థ కోరుకుంటున్నది ఇదేనా?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IIT మద్రాస్‌లో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడు. మార్చి 14, 2023న క్యాంపస్ లోని హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. దీనిపై కొట్టూర్‌పురం పోలీసులు.. కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల కాలంలో IIT మద్రాస్‌లో జరిగిన రెండో సూసైడ్ ఘటన ఇది. అలర్ట్ అయిన IIT మద్రాస్... ఇలాంటి ఘటనల్ని పరిశీలించేందుకు స్టాండింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీని ఏఱ్పాటు చేసింది. ఇందులో ఎన్నికైన విద్యార్థుల ప్రతినిధులు కూడా ఉంటారు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఏం చేస్తే వీటికి అడ్డుకట్ట పడుతుంది అనే దాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది.

ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్సే ప్రాణాలు తీస్తున్నాయని... దీనిపై ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

"విద్యా సంస్థ భారీ విద్యాపరమైన డిమాండ్లను తీర్చలేకపోవడమే ఇందుకు కారణం. ఇంతకు మించి చెప్పాల్సినది ఏమీ లేదు. ముఖ్యంగా తక్కువ ర్యాంకింగ్, రిజర్వేషన్ ఆధారిత విద్యార్థులపై భారీ కలలు, ఆశయాలూ రుద్దుతూ వారిపై ఒత్తిడి పెంచడం విచారకరం. తట్టుకోలేకపోతున్నారు" అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, IIT Madras

ఉత్తమ కథలు