• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • 95 PERCENT OF CHANDRAYAAN 2 SUCCESS AS ORBITER FLYING AROUND MOON ISRO SCIENTIST NK

చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం సక్సెస్ : ఇస్రో శాస్త్రవేత్త

చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం సక్సెస్ : ఇస్రో శాస్త్రవేత్త

ప్రతీకాత్మక చిత్రం

Chandrayaan-2 : చంద్రయాన్-2 ప్రయోగంపై ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న ఇస్రో శాస్త్రవేత్త ఒకరు... 95 శాతం సక్సెస్ సాధించినట్లు తెలిపారు. అందుకు కారణాల్ని కూడా వివరించారు.

  • Share this:
ISRO : చందమామపై ఇస్రో దింపిన విక్రమ్ ల్యాండర్... సేఫ్‌గా దిగిందా లేక... చందమామపై అది కూలిపోయిందా అన్నది ప్రస్తుతానికి తేలని అంశం. అది తేలేందుకు రెండ్రోజులు పడుతుందని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్... చందమామపై దిగుతూ... 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా... దాని నుంచీ ఇస్రోకి ఎందుకు సిగ్నల్స్ కట్ అయ్యాయన్నది తేల్చే పనిలో ఉన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇంతకీ ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అయ్యిందన్న ప్రశ్నకు (పేరు చెప్పడానికి ఇష్టపడని) ఇస్రో శాస్త్రవేత్త ఒకరు అత్యంత స్పష్టమైన సమాధానం ఇచ్చారు. నిజానికి చంద్రయాన్-2 అనేది... మూడు పరికరాల ప్రాజెక్టు. ఒకటి... చంద్రయాన్-2 ఆర్టిటర్. ఇది చందమామ చుట్టూ తిరిగే పరికరం. దాదాపు శాటిలైట్ లాంటిది. రెండోది విక్రమ్ ల్యాండర్. ఇది చందమామపై దిగే ల్యాండర్. నాలుగు పలకల బాక్సులా ఉంటుంది. ఇది ఎక్కడ దిగుతుందో అక్కడే స్థిరంగా ఉంటుంది. మూడోది ప్రజ్ఞాన్ రోవర్. ఇది విక్రమ్ ల్యాండర్‌ దిగిన తర్వాత... దాని ఒక డోర్ తెరచుకున్న తర్వాత బయటకు వచ్చి... చందమామపై దిగి... 500 మీటర్లు నడిచే రోవర్.

ప్రస్తుత అంచనాల ప్రకారం... విక్రమ్ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ ఆగిపోయాయి కాబట్టి... ఇక అది పనిచెయ్యదని అనుకుంటే... దానిలోపల ఉన్న రోవర్ కూడా బయటకు రానట్లే. అందువల్ల ఈ రెండింటి విషయంలో ఇస్రో ప్రయత్నం... ఓ పోరాటంతో సమానం. ఐతే... మొత్తం ప్రాజెక్టులో... చంద్రయాన్-2 ఆర్బిటర్ అతి పెద్దది. అది ఆల్రెడీ విజయవంతంగా చందమామ చుట్టూ తిరుగుతోంది. దాని తయారీకి అయిన ఖర్చు రూ.978 కోట్లు. కాబట్టి... ఇస్రో శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం... ఈ ప్రయోగం 95 శాతం విజయం సాధించినట్లు లెక్క. మిగతా ఐదు శాతం ఫెయిల్ కాదు... జస్ట్ ఓ ప్రయత్నం అనుకోవచ్చు. దాని నుంచీ నేర్చుకునే అంశాలతో... నెక్ట్స్ స్టెప్ వేసుకోవచ్చు.

చంద్రయాన్-2 ఆర్బిటర్... సంవత్సరం పాటూ పనిచేస్తుంది. అది చందమామకు సంబంధించి ఎన్నో ఫొటోలను ఇస్రోకు పంపబోతోంది. అంతెందుకు... విక్రమ్ ల్యాండర్ ఏమైందో, ఎక్కడుందో, ఎలా ఉందో కూడా ఇప్పుడు చెప్పబోయేది చంద్రయాన్-2 ఆర్బిటరే. దానికి ఉన్న కెమెరాలు... విక్రమ్ ల్యాండర్‌ను ఫొటోలు తీసి పంపనున్నాయి.

అసలేం జరిగింది : విక్రమ్ ల్యాండింగ్‌లో ఆఖరి 15 నిమిషాలు కీలకమైనవి..అత్యంత క్లిష్టమైనవి..! ఇస్రో ముందు నుంచీ చెప్పిన మాట ఇది..! అందుకు తగ్గట్లే చివరి క్షణాల్లో విక్రమ్‌కు అవాంతరయాలు ఎదరయ్యాయి. ఆ 15 నిమిషాల్లో 14 నిమిషాల పాటు సజావుగా సాగిన విక్రమ్ ప్రయాణం.. చివరి నిమిషంలో తడబడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ఉన్న ఊహించని సమస్య ఎదురైంది. చంద్రుడిపై కాలు మోపడమే తరువాయి అనుకునేలోపే.. విక్రమ్ నుంచి కమాండ్ కంట్రలో రూమ్‌కి సంకేతాలు నిలిచిపోయాయి. మరి విక్రమ్ క్రాష్ అయిందా? లేదంటే ల్యాండ్ అయ్యి కేవలం సిగ్నల్స్ మాత్రమే అందడం లేదా? అని అందరిలోనూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన విక్రమ్‌ను అదుపు చేయడం ఇస్రోకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. విక్రమ్ వేగానికి కళ్లెం వేసేందుకు సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ నాలుగు మూలలతో పాటు మధ్య భాగంలో థ్రస్టర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ అంచెను విజయవంతంగా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు ప్రణాళిక ప్రకారమే వ్యోమనౌక వేగం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన సమయంలో ఈ అవరోధం ఏర్పడింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి...గమ్యానికి చేరువలో గతి తప్పింది. ఐతే స్పీడ్ కంట్రోల్ కాక విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిందా? లేదంటే సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాక సిగ్నల్స్ నిలిచిపోయాయా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు డేటా విశ్లేషణ చేస్తున్నారు. ల్యాండర్ పరిస్థితిపై రెండ్రోజుల్లో ప్రకటన చేసే అవకాశముంది.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు