ఏపీలోని జాతీయ పార్కుల్లో 94 బేస్ క్యాంప్‌లు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో గనుల తవ్వకం, వేట, ఆక్రమణ, చొరబడటం తదితర సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో గనుల తవ్వకం, వేట, ఆక్రమణ, చొరబడటం తదితర సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ రక్షిత ప్రాంతాలలో 94 బేస్‌ క్యాంప్‌లను ఏర్పాటుచేయడంతో పాటుగా 8 సాయుధ దళాలను సైతం ప్రొటెక్టడ్‌ ఏరియా మేనేజర్లతో సహా ఏర్పాటు చేసింది. ఒకవేళ జంతువుల దాడి జరిగి ప్రాణాలు కోల్పోయినా లేదంటే గాయాల బారిన పడినా తక్షణమే పరిహారాన్ని సైతం అందిస్తున్నారు. ఈ రక్షిత ప్రాంతాలకు చుట్టు పక్కల గ్రామాలు, స్థానిక సమాజాలలో అవగాహన శిబిరాలను సైతం ఏర్పాటు చేయడంతో పాటుగా వీటి రక్షణలో స్థానికులకు సైతం భాగం కల్పిస్తున్నారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖలోని సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో ఈ సమాచారాన్ని మార్చి 8, 2021న రాజ్యసభలో ఎంపీ పరిమల్‌ నత్త్వానీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

  మంత్రి బాబుల్ సుప్రియో వెల్లడించిన వివరాల ప్రకారం, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో పలు కార్యక్రమాలను జీవవైవిధ్య సమతుల్యత నిర్వహణ కోసం అనుమతించిన నిర్వహణ ప్రణాళికలకనుగుణంగా చేస్తున్నారు. ఏపీలో ఉన్న 16 జాతీయ పార్కులలో అతిపెద్దది నాగార్జున సాగర్‌–శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది 1,402 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉంది. ఇక ద్వీపకల్పంలా ఉండే నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 1,031 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉంది. పాపికొండలు జాతీయ పార్కు 1,013 చదరపు కిలోమీటర్ల వ్యాప్తి చెంది ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు.

  Parimal Nathwani news, mp parimal nathwani, ap news, corona virus, corona aide to andhra Pradesh, పరిమళ్ నత్వానీ, ఎంపీ పరిమళ్ నత్వానీ న్యూస్, ఏపీ న్యూస్
  సీఎం జగన్‌తో ఎంపీ పరిమళ్ నత్వానీ(ఫైల్ ఫోటో)


  భారతదేశంలో జాతీయపార్కులు/వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను గురించిన వివరాలు తెలుసుకోవాలని నత్త్వానీ కోరారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వీటి స్థితిగతులు, గనుల తవ్వకం, మానవ చొరబాట్లు, వేట, ఆక్రమణలతో పాటుగా ఇతర చట్టవిరుద్ధ సంఘటనలు ఏవైనా జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో ఏమైనా జరుగుతున్నాయా? అలాంటి సంఘటనలు నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి ఆయన అడిగారు.

  దీనికి మంత్రి బాబుల్ సుప్రియో స్పందించారు. జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల నిర్వహణను రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రభుత్వాలు జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం,1972లో నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా చేస్తున్నాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: