హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Floods: పరిమళించిన మానవత్వం.. పునరావాస కేంద్రంలోనే బాలుడి పుట్టినరోజు వేడుకలు.. ఇంకా ముంపులోనే లంక గ్రామాలు

Floods: పరిమళించిన మానవత్వం.. పునరావాస కేంద్రంలోనే బాలుడి పుట్టినరోజు వేడుకలు.. ఇంకా ముంపులోనే లంక గ్రామాలు

పునరావాస కేంద్రంలో పుట్టిన రోజు వేడుకలు

పునరావాస కేంద్రంలో పుట్టిన రోజు వేడుకలు

Floods: వరుణుడు కాస్త తెరిపి ఇచ్చినా.. వరద కష్టాలు ఇంకా వీడడం లేదు. దీంతో ఇంకా లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. వరదలోనూ కొందరు మానవత్వం చూపిస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రంలోనే ఓ బాలుడికి పుట్టిన రోజు వేడుకలు జరిపించారు.

Andhra Pradesh Floods: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై మొన్నటి వరకు పగపట్టినట్టు కనిపించిన వరుణుడు.. కాస్త శాంతించాడు. వానలకు బ్రేక్ ఇచ్చాడు.. అయినా వరద కష్టాలు వీడడం లేదు. ఇటీవల భారీ వానలకు తోడు పై నుంచి వరదలతో.. గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. ఇప్పడు వానలు అయితే తగ్గాయి కానీ.. వరద నీటిలో బాధితులకు నరకయాతన తప్పడం లే పడుతున్నారు. ఇళ్లను వదలి వెళ్లలేక, పునరావాస కేంద్రాల్లో ఉండలేక అంతులేని అవేదనతో అవస్తలు పడుతున్నా లంక గ్రామాలవాసులు. గత రెండు మూడు రోజులతో పోల్చుకుంటే.. ప్రస్తుతం గోదావరి వరద (Godavari floods) ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, వరద ప్రాంతాల్లో నీరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ప్రస్తుతానికి చాలా వరకు లంక గ్రామాలు  (Lanka villages) జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పూర్తిగా నీరు పోయినంత వరకు.. బాధితులు పునరావాస కేంద్రాల్లోనూ, తాత్కాలిక షెల్టర్లలోనూ తలదాచుకుంటున్నారు. వరద తగ్గుముఖం పడుతున్న ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు అధికారులు చర్యలు కొనసాగుతున్నాయి. యలమంచిలి మండలంలో తొమ్మిది, ఆచంట మండలంలో ఐదు, నరసాపురం మండలంలో రెండు గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. నరసాపురం పట్టణంలోని మూడు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇంకా పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. పాలకొల్లు-నరసాపురం ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది.

ఓ వైపు వరద బాధితులు నానా అవస్థలు పడుతున్నా.. కొంతమంది మానవత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా వరద బాధిత ముంపు ప్రాంతాల పునరావాస కేంద్రంలో అధికారులు ఒక బాలుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరద ముంపు ప్రాంతాలైన కొత్త నవరసాపురం పాత నవరసపురం గ్రామాల పునరావస కేంద్రం స్థానిక మిషన్ హై స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నవరసపురం గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలుడు మధు పుట్టినరోజు వేడుకలు అధికారులు ఘనంగా నిర్వహించారు.

తమ ఇంటి దగ్గర ఉంటే పుట్టినరోజు ఘనంగా జరుపుకునే వాళ్ళం అని తల్లితండ్రులు బాలుడుతో అంటుండగా.. కొందరు అధికారులు విన్నారు. వెంటనే మానవత్వంతో పునరావాస కేంద్రంలోనే గ్రామస్తుల సమక్షంలో పుట్టినరోజు నిర్వహించారు. పునరావసర కేంద్ర ప్రత్యేక అధికారి ఎంపిడిఓ ఆనంద్ కుమార్ అధికారులు బాలుడితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దీనితో బాలుడు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : బాబోయ్ బాహుబలికి బాబులా ఉంది..? ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు..?

మరోవైపు రాజోలు దీవిలోని అనేక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే చిక్కుకున్నాయి. అనేక గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతుండడంతో.. లంక గ్రామస్థులు ఇంకా పడవలు పైనే ప్రయాణం సాగిస్తున్నారు. అప్పనపల్లిలో వరద కొనసాగుతుంది. అయితే పంచాయతీవారు తమకు పెడుతున్న భోజనం తినలేక పోతున్నామంటూ.. వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు..పంచాయతి సిబ్బంది పంపిన భోజనం తిన లేక మెత్తబడిపోయిన అన్నాన్ని గ్రామస్థులు కుక్కలకు పెడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP Floods, AP News, Birthday, East Godavari Dist

ఉత్తమ కథలు