ప్రకాశంలో మరణ మృదంగం.. శానిటైజర్ తాగి ఏడుగురు మృతి

కరోనా నేపథ్యంలో 10 రోజులుగా యాచకులతో పాటు పలువురు స్థానికులు నాటుసారాకు, శానిటైజర్ తాగుతున్నారు. చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్‌లో కొందరు సారా కలుపుకొని తాగారు.

news18-telugu
Updated: July 31, 2020, 9:37 AM IST
ప్రకాశంలో మరణ మృదంగం.. శానిటైజర్ తాగి ఏడుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏడుగురు మరణించారు. కురిచేడు మండల కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు గురువారం శానిటైజర్ తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు గురువారం మరణించారు. చికిత్స పొందుతూ ఇవాళ మరో నలుగురు చనిపోయారు. మృతులను రమణయ్య(28), అనుగొండ శ్రీను (25), భోగెమ్‌ తిరుపతయ్య(37), గుంటక రామిరెడ్డి(60, రమణయ్య(65) రమణయ్య(65), రాజారెడ్డి(65)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో 10 రోజులుగా కురిచేడులో మద్యం షాపులు మూతపడ్డాయి. ఈ క్రమంలో యాచకులతో పాటు పలువురు స్థానికులు నాటుసారా, శానిటైజర్ తాగుతున్నారు. చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్‌లో కొందరు సారా కలుపుకొని తాగారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఏపీలో మద్యం నిషేధమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టింది. మద్యం షాపులను తగ్గించడంతో పాటు ధరలను భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో నాటు సారా విక్రయాలు జోరందుకున్నాయి. తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో కూలీలు నాటు సారాకు బానిసవుతున్నారు. అది కూడా లేని చోట ప్రమాదకరమైన శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 8:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading