ప్రకాశంలో బయపడిన క్రీస్తు పూర్వం నాటి సమాధులు.. వాటిలో ఏమున్నాయంటే..

అద్దంకికి చెందిన చారిత్ర పరిశోధకుడు జ్యోతి చంద్రౌళి వాటిని పరిశీలించి.. ఆ సమాధులు క్రీస్తు పూర్తం 8వ శతాబ్ధానికి చెందినవిగా వెల్లడించారు. గిరిజన తెగలకు చెందిన వారు ఎక్కువగా సమృద్ధిగా ఉన్న కొండ ప్రాంతాల్లోలో నివసించేవారని తెలిపారు.

news18-telugu
Updated: July 30, 2020, 2:28 PM IST
ప్రకాశంలో బయపడిన క్రీస్తు పూర్వం నాటి సమాధులు.. వాటిలో ఏమున్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పొలం దున్నతుంటే దేవుడి విగ్రహాలు బయటపడిన ఘటనలు చాలా చూశాం. లంకె బిందెలు కూడా దొరికినట్లు వార్తల్లో విన్నాం. కానీ ప్రకాశం జిల్లాలో అతి పురాతనమైన సమాధులు బయటపడ్డాయి. సంతమాగులూరు మండలం కుందుర్రులో వీటిని గుర్తించారు. బొగ్గుల కొండ పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో యడ్లపల్లి మురళి అనే రైతు దుక్కి దున్నిస్తున్న సమయంలో నాగలికి బండరాయి తగిలింది. ఏంటా అని తవ్వి చూశారు. ఓ పొడవాటి బండరాయి కనిపించడంతో చుట్టు పక్కన కూడా పరిశీలించారు. మరొక చోట మట్టికుండతో పాటు ఎముకల అవశేషాలు లభించాయి.

పురాతన సమాధులు ఉందన్న విషయం తెలుసుకొని..వాటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. ఐతే అద్దంకికి చెందిన చారిత్ర పరిశోధకుడు జ్యోతి చంద్రౌళి వాటిని పరిశీలించి.. ఆ సమాధులు క్రీస్తు పూర్తం 8వ శతాబ్ధానికి చెందినవిగా వెల్లడించారు. గిరిజన తెగలకు చెందిన వారు ఎక్కువగా సమృద్ధిగా ఉన్న కొండ ప్రాంతాల్లోలో నివసించేవారని తెలిపారు. గిరిజన తెగల్లో ఎవరైనా చనిపోతే బండరాతి సమాధిలో భద్రపరిచే వారని చెప్పుకొచ్చారు. అక్కడ దొరికిన ఎముకల అవశేషాలను బట్టి.. అప్పటి మనుషులు ఏడుగుల భారీ కాయంతో ఉండేవారని అంచనా వేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 30, 2020, 1:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading