70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. విజయనగరంలో దారుణం

ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

news18-telugu
Updated: September 25, 2019, 6:56 PM IST
70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. విజయనగరంలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 25, 2019, 6:56 PM IST
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. మానవత్వానికి మచ్చ తెచ్చే దారుణ ఉదంతమిది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన నానమ్మ వయసున్న వృద్ధురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బేరీ వీధిలో ఓ వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పక్కింట్లో ఉండే ప్రవీణ్ (25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...