6000 ఎకరాల చుట్టూ ఏపీ రాజధాని వివాదం... అదే నిజమా?

ఏపీలో మూడు రాజధానుల అంశం తీవ్ర కలకలం రేపుతోంది. దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నాయి. మరి 6000 ఎకరాల వివాదమేంటి?

news18-telugu
Updated: December 21, 2019, 6:20 AM IST
6000 ఎకరాల చుట్టూ ఏపీ రాజధాని వివాదం... అదే నిజమా?
చంద్రబాబు, జగన్
  • Share this:
ఏపీలో మూడు రాజధానులు, నాలుగు రీజియన్లు (ప్రాంతాలు)గా... విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలనే కమిటీ సూచనలపై అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ప్రధానంగా అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనేశారని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు... విశాఖలో 6000 ఎకరాల భూములు కొన్నారనీ... అందుకే విశాకను పరిపాలనా రాజధానిగా మార్చుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్న వైసీపీ... ఎసైన్డ్ భూములు... ఎవరికి కేటాయించారో అవి వారికే చెందుతాయనీ, అలా తమ ప్రభుత్వం చేస్తుందని చెబుతున్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ విస్తరించడమే తమ లక్ష్యం అంటున్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి బొత్స సత్యనారాయణ... డిసెంబర్ 27న జరిగే కేబినెట్ సమావేశంలో GN రావు రిపోర్టుపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐతే... GN రావు రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టలేదు. కేబినెట్ ఆమోదించిన తర్వాతే దాన్ని బయటపెడతారని తెలుస్తోంది.

GN రావు నివేదికపై విశాఖ, రాయలసీమలో పాజిటివ్ అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే... అమరావతి ప్రాంతంలో రైతులు మాత్రం భగ్గుమంటున్నారు. రాజధానిగా అమరావతి ఉంటుందనే హామీతోనే తాము భూములు ఇచ్చామనీ... ఇప్పుడా హామీని మార్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. కట్టుబట్టలతో తమను రోడ్డున పడేశారని మండిపడుతున్నారు. ఐతే... ప్రభుత్వం భూములు తిరిగి ఇచ్చేస్తామని అంటోంది. అలా ఇచ్చేసినంత మాత్రాన తమకు న్యాయం జరిగినట్లు అవుతుందా అని ప్రశ్నిస్తున్న అమరావతి రైతులు... నాలుగేళ్లుగా అటు పంటలూ లేక... ఇటూ రాజధానీ దక్కక తమకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు