ఉల్లి కిలో రూ.50... రానున్న రోజుల్లో మరింత పైకి

మరోవైపు ఉల్లి రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల నష్టాల నుంచి గట్టెక్కామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: September 22, 2019, 8:09 AM IST
ఉల్లి కిలో రూ.50... రానున్న రోజుల్లో మరింత పైకి
ఉల్లి రైతు
  • Share this:
ఉల్లి జనం కళ్లంట కన్నీరు తెప్పిస్తోంది. రోజురోజుకు ఉల్లి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దీంతో ప్రజలు ఉల్లిపాయలు కొనాలంటేనే భయపడుతు్నారు. మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డ ధర కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు పలుకుతోంది. దీంతో భగ్గుమంటున్న ధరలను చూసి వినియోగదారులు ఉల్లిపాయలను కొనాలంటేనే భయపడుతున్నారు. కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు.

మరోవైపు వర్షాలే ఉల్లి ధరలు మండిపోవడానికి కారణమంటున్నారు వ్యాపారులు. వర్షాల కారణంగా మార్కెట్‌కు ఉల్లిపాయల రాక తగ్గిపోయిందని, క్వింటాలు ఉల్లిపాయలు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు పలుకుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. వర్షాలు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఉల్లిపాయల సరఫరా మరింత కష్టంగా మారే అవకాశముందని చెప్తున్నారు. మరోవైపు ఉల్లి రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల నష్టాల నుంచి గట్టెక్కామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా.. తగ్గిన ఉల్లిసాగు.. దీంతో.. రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో.. ధరలు ఆకాశానికెక్కుతున్నాయి. గత రెండేళ్లుగా నష్టపోయామని.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఆనందంగా ఉందంటూ.. రైతులు చెబుతున్నారు

First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...