Corona Tension in Medical Colleges: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను కరోనా వైరస్ (Corona Virus) తీవ్రంగా భయపెడుతోంది. తొలి రెండు వేవ్ ల కంటే.. థర్డ్ వేవ్ (Third Wave) లో కేసులు రెట్టింపు వేగంతో నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మెడికల్ కాలేజీ (Medical
College)లు ప్రధాన కంటెయిన్మెంట్ జోన్ (Containment Zone) లు మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో కాలేజీకి పంపించాలంటే వారి తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థిితి నెలకొంది. తాజాగా కడప జిల్లా (Kadapa District)ల్లోని రిమ్స్ కాలేజీలో 50 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 150 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 50 మందికి వైరస్ సోకింది. అందులో కొంతమందికి లక్షాలు ఉండడంతో ఆస్పత్రులో జాయిన్ చేశారు. మిగిలిన వారంతా హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. అయితే రే ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్ష (MBBS Final Exams)లు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
ప్రస్తుతం 50 మందికి కరోనా సోకగా.. ఇంకా మరికొంతమంది ఫలితాలు రావాల్సి ఉంది. ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో రేపటి పరీక్షలన్నీ వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ వర్సిటీని కోరింది. అయితే ఇది అందరి విద్యార్ధులపైనా ప్రభావం చూపిస్తుందని.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నదాపై ఎన్టీఆర్ వర్శిటీ తర్జనభర్జన పడుతోంది. రేపు ఫైనల్ పరీక్షలు జరగనుండగా కోవిడ్ కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా కేసులు ఒక్కసారిగా ఇంత మందికి రావడంతో విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు రేపు పరీక్షలు ఉండడం, కరోనా కేసులు ఒకేసారిగా ఇన్ని కేసులు నమోదవడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది.
ఇదీ చదవండి : నారా లోకేష్ కు కరోనా పాజిటివ్.. రాజకీయ నేతలపై వైరస్ దాడి
ఇటీవల కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. ఈ కాలేజీలో ఇప్పటివరకు 29 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. మొదట 22 మందికి కరోనా సోకగా.. తరువాత మరో 7గురికి కరోనా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపాల్ కాలేజీలో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా కాలేజీకి నేటి వరకు సెలవులు ప్రకటించారు.
ఇదీ చదవండి : 111 ఏళ్ల బామ్మ బర్త్‌డే వేడుకలు.. ఆమె ఆరోగ్యం సీక్రెట్ ఇదే.. ఎన్నో ప్రత్యేకతలు
కేవలం మెడికల్ కాలేజీలు అనే కాదు.. ఏపీ మొత్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. అయితే ఇందులో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులే అధికంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీ 28 ఒమిక్రాన్ కేసులు నమోదైన వరకు వేర్వేరుగా లెక్కలు చెప్పిది.. కానీ ఇప్పుడు అన్ని కేసులను కలిపే చెబుతున్నారు. తాజాగా ఏపీలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రేపటి నుంచి కఠినంగా నైట్ కర్ఫ్యూ విధించాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.