హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఐదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ.., అతడే ఎత్తుకెళ్లాడా..?

Andhra Pradesh: ఐదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ.., అతడే ఎత్తుకెళ్లాడా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తూర్పుగోదావరి జిల్లా (East Godawari) రాజమండ్రి (Rajahmundry) లో కిడ్నాప్ కలకలం రేగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

  ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిడ్నాప్ కలకలం రేగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. లేస్ ప్యాకెట్ ఇస్తామంటూ నమ్మించి తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. రాజమండ్రిలోని దుర్గమ్మ గుడి వీధికి చెందిన చిన్నారి రోహిణి ఇంటి ఎదుట ఆడుకుంటోంది. అదే సమయంలో అక్కడికి బైక్ పై వచ్చిన ఓవ్యక్తి లేస్ ప్యాకెట్ కొనిస్తానంటూ బాలికను తీసుకెళ్లాడు. చిన్నారి కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుకపక్కల ఇళ్లలో గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.

  అతడే ఎత్తుకెళ్లాడా..?

  బాలిక కిడ్నాప్ వ్యవహారంలో ఓ వ్యక్తిని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చిన్నారి రోహిణిని పెంచుకుంటానని., తనకిచ్చేయాలని ఓ వ్యక్తి అడిగినట్లు చెప్తున్నారు. ఇప్పుడు అతడే పాపను ఎత్తుకెళ్లి ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ అతను ఎవరనేది వారు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు చెప్పిన గుర్తుల ఆధారంగా పోలీసులు దుండగుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు పాప కిడ్నాప్ కు గురవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కిడ్నాపర్లు చిన్నారిని ఏం చేస్తారోనని కంగారు పడుతున్నారు.

  పోలీసులు మాత్రం వీలైనంత త్వరగా పాప ఆచూకీ కనుక్కుంటామని ధీమాగా చెప్తున్నారు. ఇప్పిటికే పాప ఫోటోలను రాజమండ్రితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు పంపామన్నారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే చెక్ పోస్టుల వద్దకూడా తనిఖీలు జరుపుతున్నామన్నారు. అలాగే చిన్నారి రోహిణి కుటుంబంతో ఎవరికైనా విభేదాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి బెదిరింపు కాల్స్ గానీ, డబ్బులు డిమాండ్ చేస్తూ గానీ ఫోన్లు రాకపోవడంతో పాపను పెంచుకుంటానన్న వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime, Kidnap, Rajahmundry S01p08

  ఉత్తమ కథలు