• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • 5 KILLED IN AN ACCIDENT AS VAN HITS AUTO RICKSHAW IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు... పాలవ్యాను రూపంలో మృత్యువు...

Andhra Pradesh: రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు... పాలవ్యాను రూపంలో మృత్యువు...

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: తెల్లవారుజామున దారి కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Share this:
    వాళ్లంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు. చేపలు పడితే గానీ వారి కడుపు నిండదు. తెల్లవారుజామునే వెళ్లి నాలుగు చేపలు పట్టుకొని ఎండ వచ్చేసరికి తిరిగొద్దామని భావించారు. ఆటో ఎక్కేందుకు రోడ్డుపై నిల్చున్నారు. రెండు నిముషాలు ఆగితే ఆటోలో వెళ్లిపోయేవాళ్లు. కానీ పాలవ్యాను రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. క్షణాల్లో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద నెల్లూరు-ముంబై హైవేపై ఆగి ఉన్న ఓటును పాలవ్యాను ఢీకొట్టింది. దీంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

    మృతులు దువ్వూరులోని ఎస్సీ కాలనీ వాసులు కె.బాబు(55), టి. రమణయ్య(60), కె. మాలకొండయ్య(50), జి. శీనయ్య(50), మోచర్ల.శీనయ్యగా గుర్తించారు. వీరంతా కొడవలూరు మండలం, రాజుపాలెం వద్ద చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ మృత్యువాత పడ్డారు. రాజుపాలెం వెళ్లేందుకు 14 మంది ఆటో ఎక్కుతుండగా.. వెనుకవైపు నుంచి వచ్చిన వ్యాను ఆటోను ఢీ కొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తో పాటు మరో నలుగురకి తీవ్రగాయాలయ్యాయి.

    ఇది చదవండి: పరిచయం లేనివారికి ఫోన్ ఇస్తున్నారా.. ఈ వార్త చదివితే అస్సలు ఇవ్వరు..



    ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున దారి కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందడం కలచివేసిందని యన అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు