బోటులో బయపడ్డ 5 మృతదేహాలు.. 38 రోజులుగా నదిలోనే..

బోటులో ఐదు మృతదేహాలు ఉన్నట్లు సత్యం టీమ్ గుర్తించింది. 38 రోజులుగా ఆ మ‌ృతదేహాలు బోటులోనే ఉన్నాయి.

news18-telugu
Updated: October 22, 2019, 3:25 PM IST
బోటులో బయపడ్డ 5 మృతదేహాలు.. 38 రోజులుగా నదిలోనే..
రాయల్ వశిష్ట బోటు
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో రాయల్ వశిష్ట ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కాసేపటి క్రితమే ధర్మాడి సత్యం బృందం బోటును నీటిపైకి తీసుకొచ్చింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు, తాళ్ల సాయంతో బోటును పైకి లాక్కొచ్చారు. కాకినాడ పోర్టు అధికారికి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. మరికాసేపట్లో ఒడ్డుకు తీసుకురానున్నారు. ఐతే బోటులో ఐదు మృతదేహాలు ఉన్నట్లు సత్యం టీమ్ గుర్తించింది. 38 రోజులుగా ఆ మ‌ృతదేహాలు బోటులోనే ఉన్నాయి. బోటును వెలికితీయడంతో ఆ డెడ్‌బాడీలు బయటపడ్డాయి. అవి కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఎవరివనేది గుర్తించడం కష్టంగా మారింది. అటు బోటు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

కాగా, సెప్టెంబరు 15న తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు సమీపంలో గోదావరి నదిలో రాయల్ వశిష్ట పడవ మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 26 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటడగా.. 39 మంది చనిపోయారు. గోదావరి నదిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐతే మరో 12 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com