చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీ పల్లి మండలం మహల్ క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులను రాయచోటికి చెందిన వారిగా గుర్తించారు. తిరుపతి నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు తెలిపారు. బస్సు పూర్తిగా కుడివైపు లేన్‌లోకి ప్రవేశించి.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఆర్టీసీ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి :
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor