హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

National Highway Projects In Ap: ఏపీపై కేంద్రం వరాల జల్లు..ఏకంగా 31,000 కోట్ల వ్యయంతో 39 జాతీయ రహదారులు

National Highway Projects In Ap: ఏపీపై కేంద్రం వరాల జల్లు..ఏకంగా 31,000 కోట్ల వ్యయంతో 39 జాతీయ రహదారులు

union minister nitin gadkari

union minister nitin gadkari

National Highway Projects In Ap: 2022-23లో సుమారు 31,000 కోట్ల వ్యయంతో 39 జాతీయ రహదారి ప్రాజెక్టులు మంజూరు చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీలో జాతీయ రహదారులకు సంబంధించి ఎంపీ పరిమల్ నత్వాని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈ వివరాలు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

National Highway Projects In Ap: ఏపీపై కేంద్రం వరాలు కురిపించింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 39 జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంది. ఇకపోతే ఈ మేరకు గత 3 ఏళ్లలో ఏపీలో మొత్తం రూ.58,318.29 కోట్లతో 3605 కిలోమీటర్ల పొడవుతో 134 జాతీయ రహదారి ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పుకొచ్చారు. అలాగే 2022-23లో సుమారు 31,000 కోట్ల వ్యయంతో 39 జాతీయ రహదారి ప్రాజెక్టులు మంజూరు చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీలో జాతీయ రహదారులకు సంబంధించి ఎంపీ పరిమల్ నత్వాని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా నితిన్ గడ్కరీ  (Nitin Gadkari) ఈ వివరాలు వెల్లడించారు.

ఈ రహదారులకు సంబంధించి ప్రతీ ప్రాజెక్టు పొడవు, వ్యయంతో సహా రాబోయే 3 నుంచి 5 ఏళ్లకు ఏపీ రాష్ట్రానికి మంజూరైన కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టుల గురించి నితిన్ గడ్కరీ  (Nitin Gadkari) పూర్తి వివరాలు వెల్లడించారు. జాతీయ రహదారుల అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్న నితిన్ గడ్కరీ వనరుల ఆధారంగా రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఆధారపడతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ట్రాఫిక్ పరిణామం, DPR ఫలితాలు అంతర్ ప్రాధాన్యత ఆధారంగా ప్రాజెక్టుల మంజూరు ఉంటుందని కేంద్ర మంత్రి  గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు.

ఏపీలోని అతి పెద్ద జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో బెంగళూరు- విజయవాడ ఎక్స్ ప్రెస్ వే ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది రూ.6169 కోట్ల వ్యయంతో (Pkg-1 నుండి VI వరకు) 160 కిలోమీటర్ల పొడవుతో ఉంది.

ఇక మరో ప్రధాన ప్రాజెక్టు..బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే Pkg-XI నుండి XIV) వరకు రూ.4120 వ్యయంతో మొత్తం నాలుగు లైన్లతో 1115.254 కిలోమీటర్ల పొడవుతో ఆమోదం/మంజూరైనా/ మంజూరయ్యే జాబితాలో ఉంది.

అలాగే NH-716లోని కడప నుండి చిన్న వరంపాడు వరకు నాలుగు లైనింగ్, NH 716లోని చిన్న ఓరంపాడు నుండి రేణిగుంట వరకు నాలుగు లేనింగ్, NH 71లోని నాయుడుపేట-తూర్పు కనుపుర సెక్షన్ లో ఆరు లేనింగ్ (Pkg-IV) ఇందులో చేర్చబడ్డాయి.

NH-16 వద్ద ఏర్పాటు చేయబడిన MMLP నుండి కంటైనర్ ట్రయిలర్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుండి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్/అండర్ పాస్ నిర్మాణం కూడా ఇక్కడ చేర్చబడింది.

ఇదిలా ఉంటే ఈరోజు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యలు, పెండింగ్ బకాయిలకు సంబంధించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Nitin Gadkari

ఉత్తమ కథలు