Home /News /andhra-pradesh /

35 INJURED IN BUS ACCIDENT AT JAGGAIAHPET KRISHNA DISTRICT PRN

Andhra Pradesh: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కృష్ణాజిల్లా(Krishna District) లో బస్సు బోల్తా పడి 35 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది



    ఇటీవల జాతీయ రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగమంచు అతివేగం కారణంగా ప్రమాదాల సంఖ్య పెరుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రవేట్ ట్రావెల్స్ బస్సు కృష్ణాజిలా జగ్గయ్యపేట మండలం, అనుమంచిపల్లి వద్ద బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో విశాఖపట్నంతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారున్నారు.

    ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. పలువుర్ని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా..కొందరు ఇతర వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు.

    పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై ట్రావెల్స్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. డ్రైవర్ కూడా గాయపడటంతో డిశ్చార్జ్ అయిన తర్వాత అతన్ని విచారించనున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Accident, Andhra Pradesh, Krishna District, Road Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు