Home /News /andhra-pradesh /

31 MIGRANT WORKERS TRAVEL TO THEIR OWN VILLAGES HIDING AMONG THE GOODS IN HYDERABAD BN

సరుకుల మధ్య దాక్కుని.. 31 మంది వలస కార్మికులు ఏం చేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ నుంచి నిత్యావసర సరకులతో విజయనగరం వచ్చిన రెండు వాహనాల్లో 31మంది వలస కార్మికులు దొంగతనంగా జిల్లాలోకి ప్రవేశించారు.

    లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. హైదరాబాద్ నగరంలో ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. అయితే చాలామంది వలస కార్మికులు ఏలాగైనా తమ ఊళ్లకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 31 మంది వలస కార్మికులు సరుకుల మధ్య దాక్కుని రెండు వాహనాల్లో విజయనగరం జిల్లాకు బయలుదేరారు. కానీ చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నుంచి నిత్యావసర సరకులతో విజయనగరం వచ్చిన రెండు వాహనాల్లో 31మంది వలస కార్మికులు దొంగతనంగా జిల్లాలోకి ప్రవేశించారు. రెండు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్ నుంచి బయలుదేరిన వీరంతా.. ఆ వాహనాలు చెక్‌పోస్టుల వద్దకు రాగానే సరకుల మధ్య దాక్కున్నారు.

    గత అర్ధరాత్రి దాటాక విజయనగరంలోని గజపతినగరం చేరుకున్నారు. ఆ రెండు వాహనాల మీద అనుమానం రావడంతో పోలీసులు సరకులను పరిశీలించారు. అందులో 31 మంది ఉన్నారని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని పార్వతీపురం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అందరికీ వైద్యపరీక్షలు జరపనున్నారని పోలీసులు వెల్లడించారు. వారంతా బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం మండలాలకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఆ రెండు వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Andhra Pradesh, Essential goods, Hyderabad, Vijayanagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు